శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న హన్సిక ‘మై నేమ్ ఈజ్ శృతి’

హైదరాబాద్ : ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ది హిడెన్ ట్రూత్ అనేది ఉపశీర్షిక. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లేతో హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్లో పోషించనటువంటి సరికొత్త పాత్రలో నటిస్తున్నారన్నారు. సస్సెన్స్ థ్ల్రిలర్‌ని ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని కలిగించే చిత్రమిదన్నారు.
ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది చిత్ర కథాంశం అని తెలిపారు. ఆగస్టు రెండో వారంలో రెండో షెడ్యూల్‌ని ప్రారంభిస్తామన్నారు. మురళీశర్మ, జయప్రకాష్, ఆడుకాలం నరెన్, రాజా రవీంద్ర, సీవీఎల్ వినోదిని, సాయితేజ్ కాల్వకోట, మహేష్ తదితరులు నటిస్నున్న ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ బోయిడపు, సంగీతం: మార్క్.కె.రాబిన్, ఎడిటర్: చోట.కె.ప్రసాద్, ఆర్ట్: గోవింద్ ఇరసాని, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బరావు గూడపాకల, లైన్ ప్రొడ్యూసర్: కె.విజయ్‌కుమార్, సహ నిర్మాతలు: పవన్‌కుమార్ బండి, ఎజీ ఎలియస్, రచన-దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

