Aishwarya Rajesh | ఐశ్వర్యరాజేష్ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘డియర్’. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా తెరకక్కుతున్న ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. వరుణ్ తిరిపురేణి, అభిషేక్ రామ్, పృథ్వీరాజ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ ‘. చెన్నయ్, ఇడుక్కి, కూనూర్ తదితర ప్రాంతాల్లో 35 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తిచేశాం.
నేటితరం మెచ్చే కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని ఎమోషన్స్ వుంటాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’అన్నారు. కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్.