Gopichandh | సమ్మర్‌ను టార్గెట్ చేసిన గోపిచంద్.. రామబాణం రిలీజ్ డేట్ ఫిక్స్
గతకొంత కాలంగా గొపిచంద్ కెరీర్ ఒక అడుగు ముందుకు పడుతుంటే నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. కెరీర్ బిగెనింగ్‌లో వరుస హిట్లతో జోరు చూపించిన గోపిచంద్.. ఈ మధ్య కాలంలో కాస్త డల్ అయ్యాడు.
Ramabanam Movie | గతకొంత కాలంగా గొపిచంద్ కెరీర్ ఒక అడుగు ముందుకు పడుతుంటే నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. కెరీర్ బిగెనింగ్‌లో వరుస హిట్లతో జోరు చూపించిన గోపిచంద్.. ఈ మధ్య కాలంలో కాస్త డల్ అయ్యాడు. నిజానికి గోపిచంద్ హిట్టు చూసి తొమ్మిదేళ్లయింది. లౌక్యం తర్వాత ఇప్పటివరకు గోపిచంద్‌కు హిట్టే లేదు. మధ్యలో జిల్, గౌతమ్ నందా, సీటిమార్ వంటి సినిమాలు బాగానే ఆడినా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయాయి. ఇక గతేడాది భారీ అంచనాల మధ్య రిలీజైన పక్కా కమర్షియల్ పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కు తీసుకురాలేకపోయింది. దాంతో తనకు అచ్చొచ్చిన దర్శకుడు శ్రీవాస్‌తో రామబాణం సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై కాస్తో కూస్తో మంచి బజ్నే క్రియేట్ చేశాయి. పైగా ఈ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా తాజాగా చిత్రబృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను మే 5న రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్లో బాగా చదవండి. పరీక్షలు ఇంకా బాగా రాయండి. వేసవి సెలవుల్లో కలుద్దాం.. అంటూ కాప్షన్‌ను ఇచ్చారు. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్‌కు జోడీగా డింపుల్ హయతి నటిస్తుంది. జగతిబాబు, ఖుష్భూ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక అటు గోపిచంద్‌కు, ఇటు శ్రీవాస్‌కు ఇద్దరికి హిట్టు చాలా అవసరం. శ్రీవాస్ కూడా గతకొంత కాలంగా లైమ్లో లేడు. లౌక్యం తర్వాత ఆయన తెరకెక్కించిన డిక్టేటర్, సాక్ష్యం డిజాస్టర్లుగా మిగిలాయి. మరీ ఈ సినిమాతో అయినా వీరిద్దరూ గట్టెక్కుతారో లేదో చూడాలి.
దుష్ట శిక్షణకైనా, కుటుంబ రక్షణకైనా ❤️🔥
రామబాణమే ఆయుధం 🏹మే 5న మీ ముందుకు దూసుకొస్తున్న 🏹రామబాణం!#Ramabanam hitting Theatres on May 5th 💥
Macho Starr @YoursGopichand @DirectorSriwass @vishwaprasadtg @khushsundar @IamJagguBhai @DimpleHayathi @MickeyJMeyer @vetrivisuals… pic.twitter.com/OVwa6sQ5Jg
— People Media Factory (@peoplemediafcy) March 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

