Good Bad Ugly | ఓటీటీలోకి వచ్చేసిన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’
Good Bad Ugly | తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓటీటీలోకి వచ్చేసింది.
Good Bad Ugly | తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓటీటీలోకి వచ్చేసింది. ‘మార్క్ ఆంటోనీ’ విజయం తర్వాత దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. అజిత్‌తో పాటు త్రిష, అర్జున్ దాస్, ప్రసన్న, ప్రభు, యోగి బాబు, సునీల్ తదితరులు ఈ సినిమాలో నటించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం 20 రోజుల్లోనే రూ.250 కోట్లకు గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం ప్రస్తుతం తెలుగుతో పాటు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను పంచుకుంది నెట్‌ఫ్లిక్స్. చాలా కాలం తర్వాత అజిత్ పూర్తిస్థాయి మాస్ కమర్షియల్ చిత్రంలో నటించడంతో అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్‌కు పండగలాంటిదని, అతని పాత సినిమాల సంభాషణలు, సన్నివేశాలను ప్రస్తావిస్తూ ఉత్సాహభరితంగా కనిపించిన అజిత్‌ను తెరపై చూడటం థ్రిల్లింగ్ అనుభవమని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Game evadidhi aithe enti.. gelichedhi maathram ee King Maker🔥😎
Watch Good Bad Ugly now on Netflix in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam#GoodBadUglyOnNetflix pic.twitter.com/gwAUGRx5p5— Netflix India South (@Netflix_INSouth) May 8, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

