George Krish | శర్వానంద్ – శ్రీను వైట్ల ‘జార్జ్ క్రిష్’కు ముహూర్తం ఫిక్స్.. సంక్రాంతి టార్గెట్ ప్లాన్ చేశారా!
George Krish | హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం జార్జ్ క్రిష్ పై తాజాగా ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతుండగా, ఇప్పుడు షూటింగ్ ప్రారంభానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
George Krish | హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం జార్జ్ క్రిష్ పై తాజాగా ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతుండగా, ఇప్పుడు షూటింగ్ ప్రారంభానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. నిర్మాత అనిల్ సుంకర స్వయంగా సినిమా తొలి షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించడంతో ఈ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. నిర్మాత అనిల్ సుంకర తెలిపిన వివరాల ప్రకారం, ‘జార్జ్ క్రిష్’ సినిమా తొలి షెడ్యూల్‌ను ఆగస్టు రెండో వారం నుంచి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉండగా, షూటింగ్ కోసం చిత్రబృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. మొదటి షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై గత కొద్ది రోజులుగా అనేక పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం యువ నటి భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఆమె ఎంపిక దాదాపు ఖాయమైనట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత జరిగే రెండో షెడ్యూల్లో శర్వానంద్, భాగ్యశ్రీ బోర్సేపై కీలకమైన ప్రేమకథ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్రబృందం వేగంగా పనులు చేస్తోంది. అందుకే షూటింగ్‌ను ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా త్వరగా ముగించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి సీజన్లో విడుదలైతే కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిర్మాతలు భావిస్తున్నారట. ఒకప్పుడు వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్లో అగ్ర దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీను వైట్ల, గత కొన్నేళ్లుగా సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నారు. ఇటీవల గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘విశ్వం’ కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో తన తదుపరి సినిమాతో మళ్లీ బలంగా కంబ్యాక్ ఇవ్వాలని ఆయన కసితో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ‘జార్జ్ క్రిష్’ కోసం ఆయన కొత్త తరహా కథను సిద్ధం చేశారని, వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కథ పూర్తిగా వినోదాత్మక శైలిలో సాగుతూనే, ఓ ఆసక్తికరమైన భావోద్వేగ అంశాన్ని కలిగి ఉంటుందని సమాచారం. తెలియని వయసులో హీరో చేసిన ఒక చిన్న పొరపాటు అతని జీవితాన్ని ఎలా మార్చేసింది? ఆ నిర్ణయం తర్వాత అతను ఎదుర్కొన్న పరిణామాలు ఏమిటి? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

