Ganapath Movie | ఉత్కంఠ రేకెత్తిస్తున్న గణపథ్ ట్రైలర్.. టైగర్ ష్రాఫ్‌కు తెలుగులో భారీ హిట్టు పక్కా..!
Ganapath Movie | పదిరోజుల కిందట రిలీజైన గణపథ్ టీజర్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌తో ఈ సినిమా ఫ్యూచరిస్టిక్ నేపథ్యంలో ఉండబోతుందని ఓ చిన్న క్లారిటీ వచ్చేసింది.
Ganapath Movie | పదిరోజుల కిందట రిలీజైన గణపథ్ టీజర్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌తో ఈ సినిమా ఫ్యూచరిస్టిక్ నేపథ్యంలో ఉండబోతుందని ఓ చిన్న క్లారిటీ వచ్చేసింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ధనవంతులకు, పేదలకు మధ్య గోడను బద్దలు కొట్టే యోధుడొకడు వస్తాడు. ఆ యోధుడు చచ్చేవాడు కాదు చంపేవాడంటూ టైగర్ ష్రాఫ్‌కు వీర లెవల్లో ఎలివేషన్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఒక ధనవంతుడి చేతిలో నలిగిపోతున్న జనాలను కాపాడేందుకు టైగర్ ష్రాఫ్ వస్తాడని తెలుస్తుంది. అంతేకాకుండా విలన్‌పై దాడి చేయడానికి హీరో ఎంచుకున్న మార్గం బాక్సింగ్ అని.. ఆ రింగ్‌లో విలన్‌ను, వాళ్ల మనుషులను మట్టుకురిపిస్తే విలన్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందన్నట్లు ట్రైలర్లో చూపించారు.
ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగియాయి. అంతేకాకుండా మరో 50ఏళ్ల తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుందొనని సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే సబ్జెక్ట్‌కు యాక్సన్‌ను పుష్కలంగా జోడించినట్లు ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది. అమితాబ్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. నేషనల్ అవార్డు హీరోయిన్ కృతి సనన్ సైతం పోరాటలతో అదరగొడుతుంది. ట్రైలర్ చివర్లో గణపతి షాట్ మాత్రం వేరే లెవల్. మొత్తంగా ట్రైలర్ కాస్త ఆసక్తి రేకెత్తించేలానే కనిపిస్తుంది. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 20న హిందీతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. అదే రోజున టైగర్ నాగేశ్వరరావు.. ముందు రోజున భగవంత్ కేసరి, లియో సినిమాలు రిలీజవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | రాముడిగా మహేష్ బాబు.. ‘వారణాసి’లో రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా,అసలు ట్విస్ట్ ఇదే!
OTT Movies | ఈ శుక్రవారం ఓటీటీలో సందడి.. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
Nandi Awards | నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 9 ఏళ్ల పురస్కారాలు ఒకేసారి, డిసెంబర్లో గ్రాండ్ ఈవెంట్!
Hyderabad | ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
MG University | మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థుల ఘర్షణ.. రెండు వర్గాలుగా విడిపోయి దాడులు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

