రణ్‌వీర్‌సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
న్యూడ్ ఫొటోషూట్ వివాదంలో బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్‌సింగ్‌పై ముంబయి చెంబూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
న్యూడ్ ఫొటోషూట్ వివాదంలో బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్‌సింగ్‌పై ముంబయి చెంబూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. కొద్ది వారాల క్రితం సోషల్‌మీడియాలో రణ్‌వీర్‌సింగ్ పోస్ట్ చేసిన న్యూడ్ ఫొటోషూట్ వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీసులు నోటీసులు పంపించిన అనంతరం రణ్‌వీర్‌సింగ్ సోమవారం ఉదయం చెంబూర్ పోలీస్కుస్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు అవసరం ఉంటే మళ్లీ రావాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. మహిళల మనోభావాల్ని కించపరచడంతో పాటు వారి హుందాతనానికి భంగం కలిగించేలా ఆ ఫొటోషూట్ ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

