నవ్వించడంలో కిక్ ఏమిటో తెలిసింది!
“ఎఫ్-3’ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడం మా టీమ్ అందరికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ‘ఎఫ్-3’లో మూడో ఎఫ్‌కు అర్థమేంటని అడుగుతున్నారు. ఎఫ్ ఫర్ ఫ్యామిలీ అనుకోవాలి’ అని అన్నారు అనిల్ రావిపూడి.
“ఎఫ్-3’ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడం మా టీమ్ అందరికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ‘ఎఫ్-3’లో మూడో ఎఫ్‌కు అర్థమేంటని అడుగుతున్నారు. ఎఫ్ ఫర్ ఫ్యామిలీ అనుకోవాలి’ అని అన్నారు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘ఎఫ్-3’ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను సోమవారం నిర్వహించారు. అనిల్‌రావిపూడి మాట్లాడుతూ “ఎఫ్-2’ను మించి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ‘ఎఫ్-2’ రిలీజ్ అయినప్పుడు తిరుపతిలోని ఓ థియేటర్లో సినిమా చూశా. ఫ్యామిలీస్‌లో అందరూ హాయిగా నవ్వుతూ కనిపించారు. నవ్వించడంలో ఉండే కిక్ ఏమిటో అప్పుడే అర్థమైంది.
అందుకే ఈ సినిమా చేశాం. ఇది సక్సెస్ అయితే ‘ఎఫ్-4’ తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నా’ అని చెప్పారు. ‘కోవిడ్ తర్వాత నా రెండు చిత్రాలు ఓటీటీలో విడులయ్యాయి. ఈ సినిమాతో మిమ్మల్ని థియేటర్లో కలుసుకోవడం ఆనందంగా ఉంది. మీ కుటుంబాలతో కలిసి సినిమాను ఎంజాయ్ చేయండి’ అని వెంకటేష్ పేర్కొన్నారు. ‘ఎఫ్-2’ ప్రాక్టీస్ మ్యాచ్ అనుకుంటే…ఈ సీక్వెల్ మెయిన్ మ్యాచ్ లాంటిదని..సిక్స్ కొడితే బాల్ స్టేడియం బయటకు వెళ్తుందని వరుణ్‌తేజ్ చెప్పారు. ఈ సినిమాతో వందశాతం నవ్వులు గ్యారెంటీ అని కథానాయికలు తమన్నా, మెహరీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

