L2 Empuraan | కేంద్రం కక్ష గట్టిందా.. ‘ఎల్2 ఎంపురాన్’ నిర్మాతపై ఈడీ దాడులు
Gokulam Gopalan | 'ఎల్2 ఎంపురాన్' సినిమాపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టినట్లు తెలుస్తుంది. ఎప్పుడయితే ఈ సినిమా బీజేపీ హిందుత్వ రాజకీయలకు వ్యతిరేకంగా ఉందని టాక్ వచ్చిందో అప్పటినుంచే ఈ సినిమాను టార్గెట్ చేస్తూ వస్తుంది.
Gokulam Gopalan | ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టినట్లు తెలుస్తుంది. ఎప్పుడయితే ఈ సినిమా బీజేపీ హిందుత్వ రాజకీయలకు వ్యతిరేకంగా ఉందని టాక్ వచ్చిందో అప్పటినుంచే ఈ సినిమాను టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి 51 సన్నివేశాలను బలవంతంగా తీసివేయించిన కేంద్రం మోహన్లాల్తో క్షమాపణలు కూడా చెప్పించుకుంది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాతపై కేంద్రం ఈడీని ప్రయోగించింది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీ గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ అధినేత గోకులం గోపాలన్ కార్యాలయల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి)శుక్రవారం ఉదయం సోదాలు చేపట్టింది. శ్రీ గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిపినట్లు తెలుస్తుంది. మరోవైపు కేంద్రం కావాలనే టార్గెట్ చేసి ఎంపురాన్ చిత్రబృందంపై దాడులు చేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఎంపురాన్ వివాదం ఎంటంటే
మోహన్లాల్ (Mohanlal) హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మార్చి 27న విడుదలైంది. అయితే ఈ మూవీలో 2002లో గుజరాత్లో చోటుచేసుకున్న గోద్రా అల్లర్లు సంబంధించి సన్నివేశాలు ఉన్నాయి. ఈ మూవీలో బాల్రాజ్ భజరంగీ అనే వ్యక్తి ముస్లింలను కిరాతకంగా చంపడం చూపించారు. దీంతో ఈ చిత్రం హిందూ వ్యతిరేక అజెండాను ప్రోత్సహిస్తోందని బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీంతో సెన్సార్ సభ్యులు ఈ మూవీని రీ సెన్సార్ చేసి 51 కట్స్ చెప్పారు.
గోద్రా అల్లర్లు
2002 ఫిబ్రవరి 27న గుజరాత్లోని గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని సబర్మతి ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన ఈ ఘటనలో 59 మంది హిందూ యాత్రికులు మరణించారు. దీంతో ఈ వివాదం ముదిరి హిందు – ముస్లింల మధ్య అల్లర్లు చేలరేగాయి. ఈ అల్లర్లలో “బాబు బజరంగీ” అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇతడు బజరంగ్ దళ్ అనే హిందూ సంస్థలో సభ్యుడు. తన బృందాన్ని రెచ్చగొట్టి ముస్లింలపై దాడులు చేయడంతో పాటు గర్భవతిగా ఉన్న ముస్లిం మహిళను రేప్ చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కోన్నాడు. ఈ ఘటనలో దాదాపు 97 మందికి పైగా ముస్లింలు మరణించారు.
ఒక మీడియా చేసిన స్టింగ్ ఆపరేషన్లో తానే ఈ అల్లర్లకు పాల్పడినట్లు బాబు బజరంగీ చెప్పడంతో అతడికి కోర్టు జీవితకాల జైలు శిక్షను విధించింది. అయితే ఈ అల్లర్ల విషయంలో తనకు నరేంద్ర మోదీ (అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి) అలాగే ఇతర ప్రముఖ నాయకుల సహకారం ఉందని బాబు బజరంగీ పలు సందర్భాల్లో పేర్కొన్నాడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

