Dulquer Salmaan | మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన రానాతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. రానా స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
శనివారం దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ‘టాలెంటెడ్ హీరో అయిన దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం’ అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.