Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
Anupama Parameswaran | మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితం. మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో నటిగా పరిచయమైన ఆమె.. తెలుగులో ‘అ ఆ’ చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
Anupama Parameswaran | మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితం. మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో నటిగా పరిచయమైన ఆమె.. తెలుగులో ‘అ ఆ’ చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల ‘క్రేజీ కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుపమ.. తాజాగా తన సొంతింటి గురించి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుపమ పరమేశ్వరన్ తన కుటుంబ నేపథ్యం, చదువు, సొంతింటి విశేషాలను పంచుకుంది. తాను పుట్టి పెరిగిన ప్రాంతంతో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపింది. తన తండ్రి కూడా అదే ప్రాంతంలో పుట్టారని, తన తల్లి సైతం సమీప ప్రాంతానికి చెందినవారని చెప్పింది.
తమది దిగువ మధ్యతరగతి కుటుంబమని వివరించిన అనుపమ.. చదువుకోవడానికి విద్యా రుణం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే, తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ‘ప్రేమమ్’ సినిమా తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపింది. ఆ సినిమా ద్వారా వచ్చిన తొలి సంపాదనతోనే తన చదువు కోసం తీసుకున్న రుణాన్ని తీర్చేసినట్లు చెప్పింది.‘ప్రేమమ్’ సినిమా తనకు మంచి గుర్తింపుతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాన్ని కూడా ఇచ్చిందని అనుపమ తెలిపింది. ఆ సినిమా ద్వారా వచ్చిన డబ్బుతో తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో నాలుగున్నర సెంట్ల స్థలం కొనుగోలు చేసి, అందులో సొంతింటిని నిర్మించుకున్నట్లు వెల్లడించింది. 2017లో తన ఇల్లు పూర్తయిందని చెప్పింది.
తన సొంతింటి వెనుక ఉన్న కథను వివరిస్తూ.. తనకు జీవితంలో ఎంతో ముఖ్యమైన స్థానం కల్పించిన ‘ప్రేమమ్’ సినిమాను ఎప్పటికీ మర్చిపోలేనని అనుపమ పేర్కొంది. అందుకే తన ఇంటికి కూడా అదే పేరు పెట్టుకున్నట్లు తెలిపింది. అనుపమ ఇంటి బయట మలయాళ అక్షరాల్లో ‘ప్రేమమ్’ అనే పేరు కనిపిస్తుంది. ఆ సినిమా టైటిల్‌ను గుర్తుచేసేలా ఇంటికి పేరు పెట్టుకోవడం విశేషం. తన కెరీర్‌కు పునాది వేసిన సినిమాపై ఆమెకు ఉన్న కృతజ్ఞతాభావం ఈ నిర్ణయంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక సినిమా నటిగా తనకు గుర్తింపును ఇవ్వడమే కాకుండా, చదువు కోసం తీసుకున్న రుణాన్ని తీర్చుకోవడానికి, సొంతింటి కలను నిజం చేసుకోవడానికి కూడా తోడ్పడింది. అందుకే తన జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకంగా నిలిచిన ఆ సినిమా పేరునే ఇంటికి పెట్టుకుంది అనుపమ పరమేశ్వరన్. ఆమె చెప్పిన ఈ విషయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

