కాలేజీ రోజుల్ని గుర్తుకుతెస్తుంది

‘నా నిజజీవితంలో జరిగిన సంఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ సినిమాను తెరకెక్కించాను. కథతో పాటు పాత్రలతో యువతరం సహానుభూతి చెందుతారు. కాలేజీ దశను దాటిన వారికి పాత జ్ఞాపకాల్ని గుర్తుకుతెస్తుంది’ అని అన్నారు శ్రీహర్ష కొనుగంటి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘రౌడీబాయ్స్’. ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. ఈ నెల 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
నేను చదువుకునే రోజుల్లో మా కాలేజీలో ఒకే క్యాంపస్‌లో ఇంజినీరింగ్, మెడికల్ బ్రాంచ్‌లు ఉండేవి. రెండు గ్రూపుల మధ్య ఉండే స్నేహం, ప్రేమ, గొడవల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. తెలుగు తెరపై పూర్తిస్థాయి కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును భర్తీచేస్తుంది. కాలేజీ రోజుల్లో యువత పరిణతి లేని కారణంగా ఎన్నో చిలిపిపనులు చేస్తుంటారు. గొడవలు పడుతుంటారు. ఆ ఏజ్‌ను ప్రతిబింబిస్తూ సాగే కథ కావడంతో సినిమాకు రౌడీబాయ్స్ అనే టైటిల్ పెట్టాం.
పూర్తి స్వేచ్ఛనిచ్చారు
‘హుషారు’ సక్సెస్ తర్వాత నిర్మాత దిల్రాజును కలిసి ఈ కథ వినిపించా. ఆయనకు చాలా నచ్చింది. కథ సిద్ధమైన తర్వాతే ఆశిష్ పేరును దిల్‌రాజు సూచించారు. వారి కుటుంబం నుంచి పరిచయమవుతున్న హీరో కావడంతో సినిమా రూపకల్పనలో దిల్‌రాజు కుటుంబం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంది. దర్శకుడిగా నాకు పూరి ్తస్వేచ్ఛనివ్వడంతో ఏ రోజూ నేను ఒత్తిడిగా ఫీలవ్వలేదు. ఆశిష్ పాత్రచిత్రణ విభిన్నంగా ఉంటుంది. కొత్త హెయిర్‌ైస్టెల్, చేతిపై టాటూలతో వినూత్నంగా ఆయన లుక్‌ను డిజైన్ చేశాం. సినిమాను చూసిన వారందరూ ఆశిష్ నటన, డ్యాన్సులు బాగున్నాయని ప్రశంసించారు.
రియలిస్టిక్ సినిమాల్ని ఇష్టపడతా..
దర్శకుడిగా రియలిస్టిక్ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇష్టపడతా. ఒకే జోనర్‌కి పరిమితం కాకుండా విభిన్న కథాంశాలతో సినిమాలు చేయాలనుంది. తదుపరి సినిమా కోసం లాక్డౌన్ టైమ్‌లో కొన్ని కథలు రాసుకున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
‘కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకు అపార నష్టం’
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

