ఈ విజయం చాలా ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది : ది 100 చిత్ర దర్శకుడు
ఆర్కే సాగర్ కథానాయకుడిగా తెరకెక్కిన 'ది 100' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. జూలై 11వ తేదీన విడుదలైన ఈ సినిమా సక్సెస్‌పై, తన తొలి సినిమాకే ఇంత ఆదరణ రావడం పట్ల డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఆర్కే సాగర్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ది 100′ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. జూలై 11వ తేదీన విడుదలైన ఈ సినిమా సక్సెస్‌పై, తన తొలి సినిమాకే ఇంత ఆదరణ రావడం పట్ల డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ…’ఈ సినిమా కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు. భావోద్వేగం, బాధ్యత, నీతితో కూడిన కథ. ఇందులో నిజాయితీ గల పోలీస్ అధికారి బాధ్యత, బాధ, న్యాయం కోసం పోరాటం చేసే విధానాన్ని చూపించాం’ అని తెలిపారు. థియేటర్లలో సినిమాను చూసి, మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు, మాకు సపోర్ట్‌గా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ చిత్రంలోని ఎమోషన్స్ కు బాగా కనెక్ట్ అవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని అన్నారు.
ఆర్కే సాగర్ పోషించిన ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్ క్యారెక్టర్‌కు మంచి అప్లాజ్ వస్తుందన్నారు. మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ పాత్రలకు కూడా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ చిత్రానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబు, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ వంటి ప్రముఖుల నుంచి ప్రశంసలు రావడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. తన తొలి చిత్రానికి ఇంత ప్రోత్సాహం వచ్చినందుకు కృతజ్ఞుడిని అని పేర్కొన్నారు. ఈ జర్నీలో తనకు సపోర్ట్ గా నిలిచిన నిర్మాతలు రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జే తారక్ రామ్, హీరో ఆర్కే సాగర్లకు ధన్యవాదాలు చెప్పారు. ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమే ముందు ముందు మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకులకు ముందుకు రావాలనుకుంటున్నా అని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

