ఐదేళ్ల కల నిజమైంది
“దేవదాస్' చిత్రం నుంచి రామ్ ప్రయాణాన్ని చూస్తున్నా. ప్రతి సినిమాలో వైవిధ్యం కనబరుస్తున్నాడు. మనందరం గర్వించదగ్గ నటుడు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు అగ్ర నటుడు బాలకృష్ణ. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘స్కంద-ది అటాకర్' ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
“దేవదాస్’ చిత్రం నుంచి రామ్ ప్రయాణాన్ని చూస్తున్నా. ప్రతి సినిమాలో వైవిధ్యం కనబరుస్తున్నాడు. మనందరం గర్వించదగ్గ నటుడు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు అగ్ర నటుడు బాలకృష్ణ. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘స్కంద-ది అటాకర్’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ “స్కంద’..ఈ టైటిల్‌కు శిరసు వంచి నమస్కరిస్తున్నా. తెలుగులో వినూత్నమైన కథలొస్తున్నాయి. అందుకే మన సినిమాలకు విదేశాల్లో కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీనుతో మూడు సినిమాలు చేశాను. ఆయన అంకితభావంతో శ్రమిస్తాడు. ఈ సినిమాలో పెద్ద నటులు భాగమయ్యారు.
తప్పకుండా భారీ విజయం తథ్యమనిస్తున్నది’ అన్నారు. ‘ఈ కాంబినేషన్లో సినిమా చేయాలనుందని నిర్మాత శ్రీనివాస్ ఐదేళ్ల క్రితమే నాతో అన్నారు. అది ఇప్పుడు నిజమైంది. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలో నన్ను కొత్త పంథాలో చూపించారు. నా కెరీర్లో గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది. అభిమానుల కోసం ఎంత కష్టానికైనా సిద్ధంగా ఉన్నా. వినూత్నమైన కథలతో సినిమా చేస్తా. అభిమానులే నా అదృష్టం’ అని హీరో రామ్ చెప్పారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘ఇదొక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా. యాక్షన్, ఎమోషన్స్ మరో స్థాయిలో ఉంటాయి. నటుడిగా ఉత్తమ ప్రతిభ కనబరచాలని హీరో రామ్ నిరంతరం తపిస్తాడు. బాలయ్య అభిమానులు ‘అఖండ’ సీక్వెల్ గురించి అడుగుతున్నారు. ఆ సినిమా తప్పకుండా ఉంటుంది. వివరాలను తర్వాత తెలియజేస్తా’ అన్నారు. ‘స్కంద’ సినిమా ద్వారా బోయపాటితో హ్యాట్రిక్ కొట్టబోతున్నానని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

