Devi Sri Prasad | సొంతూరు జాతరలో దేవిశ్రీ ప్రసాద్ మాస్ సందడి.. వైరల్ అవుతున్న వీడియోలు, ‘ఎల్లమ్మ’ టీమ్ సర్ప్రైజ్!
Devi Sri Prasad | టాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ‘రాక్‌స్టార్’ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన సొంత గ్రామంపై ఉన్న ప్రేమను చాటిచెప్పారు. సంగీతంతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న డీఎస్పీ, తన మూలాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోనని మరోసారి నిరూపించారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తన సొంత ఊరు, అక్కడి సంప్రదాయాలు, గ్రామీణ సంస్కృతితో ఆయనకున్న అనుబంధం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.
Devi Sri Prasad | టాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ‘రాక్‌స్టార్’ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన సొంత గ్రామంపై ఉన్న ప్రేమను చాటిచెప్పారు. సంగీతంతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న డీఎస్పీ, తన మూలాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోనని మరోసారి నిరూపించారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తన సొంత ఊరు, అక్కడి సంప్రదాయాలు, గ్రామీణ సంస్కృతితో ఆయనకున్న అనుబంధం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం మండల పరిధిలో ఉన్న వెదురుపాక గ్రామం దేవిశ్రీ ప్రసాద్ కుటుంబానికి ప్రత్యేకమైన ప్రదేశం. ఆయన తండ్రి, దివంగత రచయిత సత్యమూర్తి స్వస్థలం కావడంతో ఈ గ్రామంతో డీఎస్పీకి చిన్ననాటి నుంచే ఆత్మీయ బంధం ఉంది.
ఇటీవల వెదురుపాకలో ఘనంగా నిర్వహించిన పోలేరమ్మ అమ్మవారి జాతరలో దేవిశ్రీ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సెలబ్రిటీ హోదాను పక్కనపెట్టి గ్రామస్తులతో కలిసిమెలిసి జాతరలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం డీఎస్పీ స్థానిక గరగ నృత్య కళాకారులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు వేయడం అక్కడి వారిని ఆనందంలో ముంచెత్తింది. జాతరలో గ్రామీణ వాతావరణంలో ఆయన చేసిన డ్యాన్స్, ప్రజలతో కలిసిపోయిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా “ఇదే అసలు డీఎస్పీ స్టైల్”, “స్టార్ అయినా గ్రామాన్ని మర్చిపోలేదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక దేవిశ్రీ ప్రసాద్ జాతరలో చేసిన సందడిని ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఎల్లమ్మ టీమ్ ప్రత్యేకంగా ఉపయోగించుకుంది. జాతరలోని వీడియోలు, కోనసీమ ప్రకృతి అందాలు, పోలేరమ్మ ఆలయంలో డీఎస్పీ పూజలు, గ్రామీణ కళాకారులతో కలిసి చేసిన డ్యాన్స్ క్షణాలను సేకరించి ప్రత్యేక వీడియోగా రూపొందించింది. ఈ వీడియోకు “DSP Shows The Spirit Of His Village Jathara” అనే టైటిల్‌ను పెట్టి విడుదల చేశారు. ఇందులో గ్రామీణ సంస్కృతి, జాతర ఉత్సాహం, డీఎస్పీ మాస్ ఎనర్జీ అన్నీ కలగలిపి చూపించారు. ముఖ్యంగా ‘ఎల్లమ్మ’ సినిమా గ్లింప్స్‌లో వినిపించిన జానపద బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ వీడియోను ఎడిట్ చేయడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఎల్లమ్మ సినిమాకి డీఎస్పీ కేవలం హీరోగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో, ఎల్లమ్మ అమ్మవారి ఆరాధన చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

