Devara | ‘దేవర’లో డబుల్ యాక్షన్
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘దేవర’ చిత్రం నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. టైటిల్ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘దేవర’ చిత్రం నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. టైటిల్ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. విస్మరణకు గురైన ఓ తీరప్రాంతం నేపథ్యంలో.. తన వారిని కాపాడుకోవడానికి మృగాల్లాంటి మనుషులతో ఓ ధీరోదాత్తుడైన వ్యక్తి చేసిన పోరాటం ఏమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ యాక్షన్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని తెలిసింది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్లో తండ్రి పాత్రను రివీల్ చేస్తారని, ఇందులో ఎన్టీఆర్ 60 ఏళ్ల పెద్దమనిషిగా కనిపిస్తారని అంటున్నారు. రొమాంచితమైన యాక్షన్, అదే స్థాయి ఎమోషన్స్‌తో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని తెలిసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

