ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘దేవర’ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. ఎర్ర సముద్రం నేపథ్యంలో యాక్షన్ ఘట్టాలు, ఎన్టీఆర్ చెప్పిన సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరపుకుంటున్నది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్‌గా ఉంటుందట. ఇందులో ఎన్టీఆర్ పాత్ర తాలూకు ఒక రహస్యం రివీల్ అవుతుందని, సినిమా మొత్తానికే ఆ ట్విస్ట్ హైలైట్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఈ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ రగ్గ్డ్ లుక్‌లో డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తారని అంటున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతపు నేపథ్య కథాంశంతో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్ర తొలిభాగం ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.