హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న బాలీవుడ్ తార దీపికా పదుకోన్ అస్వస్థతకు గురైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ కోసం ఆమె ఇటీవలే నగరానికి వచ్చింది. తాజా షెడ్యూల్లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆమె సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. మంగళవారం షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా దీపికా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. ఇబ్బంది పడుతున్న ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకున్న అనంతరం దీపికా హార్ట్ రేట్ మెరుగైంది. వైద్యులు ఇచ్చిన భరోసాతో తిరిగి షూటింగ్‌కు యధావిధిగా హాజరైందామె. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు.