Dacoit Movie | టాలీవుడ్ యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh), శ్రుతిహాసన్ (Shruti Haasan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’ (Dacoit). ఒక ప్రేమ కథ అనేది ఉపశీర్షిక. ఈ ప్రాజెక్ట్ ద్వారా షనియల్ డియో అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ టీజర్‌ను విడుదల చేసింది.
ఇక టీజర్ చూస్తే.. బద్ద శత్రువులుగా మారిన ప్రేమికుల కథ అని తెలుస్తుంది. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుండగా.. షూటింగ్ మొదలైనట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. త్వరలోనే ఇందులో నటించే నటినటుల పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.