Premalatha Vijaykanth | జ్యోతిష్యుడికి ప్రభుత్వ పదవా? సీఎం విజయ్ తీరును తప్పుబట్టిన ప్రేమలత విజయకాంత్!
Premalatha Vijaykanth | తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాజన్ పండిట్‌ను ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ (OSD)గా నియమించుకోవడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది.
Premalatha Vijaykanth | తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాజన్ పండిట్‌ను ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ (OSD)గా నియమించుకోవడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ అసెంబ్లీ వేదికగా తీవ్రంగా ఖండించారు.
జ్యోతిష్యుడికి అధికారిక పదవి కట్టబెట్టడంపై ఆమె మండిపడుతూ, రాజన్ పండిట్ విజయ్‌కు వ్యక్తిగత గురువు అయితే ఆయనను సొంత పనులకే పరిమితం చేసుకోవాలని, ప్రభుత్వ వ్యవస్థలోకి తీసుకురావడం సరికాదని హితవు పలికారు. యువత ఎంతో నమ్మకంతో విజయ్‌కు ఓట్లు వేశారని, ఇప్పుడు ఇటువంటి నిర్ణయాల ద్వారా భావి తరానికి ఆయన ఎలాంటి ఉదాహరణగా నిలుస్తున్నారో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ చర్య తమిళనాడు ప్రజలందరినీ అవమానించడమేనని, అసలు దీని ద్వారా విజయ్ సమాజానికి ఏ విధమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నారో స్పష్టం చేయాలని ప్రేమలత విజయకాంత్ నిలదీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
DMDK MLA Premalatha Vijaykanth questions Vijay’s decision to appoint his astrologer Rajan Pandit as his Officer on Special Duty (OSD)
“I condmen this move on behalf of all Tamil Nadu people. If he is your guru, keep him in your personal capacity. Youth have voted for… pic.twitter.com/6URGcSfQDD
— Nabila Jamal (@nabilajamal_) May 13, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

