Jetlee Movie | సెన్సార్ పూర్తి చేసుకున్న సత్య ‘జెట్లీ’.. మే 1న థియేటర్లలోకి టేకాఫ్!
Jetlee Movie | టాలీవుడ్ హాస్య నటుడు సత్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జెట్లీ' (Jet Lee) విడుదలకు సర్వం సిద్ధమైంది.
Jetlee Movie | టాలీవుడ్ హాస్య నటుడు సత్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జెట్లీ’ (Jet Lee) విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ చిత్రం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుండగా.. విభిన్నమైన కథాంశాలతో అలరించే దర్శకుడు రితేష్ రాణా తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ను జారీ చేసింది. మరోవైపు ఈ సినిమా రన్టైం 2 గంటలుగా ఉండబోతున్నట్లు సమాచారం. సత్య ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రియా సింఘా కథానాయికగా చేస్తోంది. వెన్నెల కిషోర్, హర్ష చెముడు, కబీర్ దుహాన్ సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రాణా తనదైన శైలిలో ఈ చిత్రాన్ని ఒక పవర్ప్యాక్డ్ కామెడీగా రూపొందించారు.
This flight is for everyone to enjoy ✈️#JetLee is Censored U/A
Get ready to experience inflight entertainment with bone breaking action 💥
#JetLeeTrailer
▶️ https://t.co/n7URp7YTIO#JETLEE ready for takeoff in cinemas worldwide from May 1st 💥#JETLEEfromMAY1st— BA Raju’s Team (@baraju_SuperHit) April 25, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

