bhola shankar భోళా శంకర్ షూటింగ్ మొదలెట్టేశారు..

bhola shankar | చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందించనున్న ‘భోళా శంకర్’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకొంది. ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, వి.వి.వినాయక్ కెమెరా స్విఛాన్ చేశారు.
దర్శకుడు మెహర్ రమేష్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా నడిచే కథ ఇది. సత్యానంద్ ఆధ్వర్యంలో స్క్రిప్ట్‌వర్క్ చేశాం. చిరంజీవితో సినిమా తీయాలన్నది నా చిరకాల స్వప్నం. అది ఈ సినిమాతో నెరవేరడం ఆనందంగా ఉంది. ఇందులో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నది. ఈ సినిమాలో పాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. చిరంజీవి అన్నయ్య వ్యక్తిత్వాన్ని చూసి ఆయన్ని అందరు భోళాశంకర్ అంటారు. ఈ టైటిల్ వల్ల సరికొత్త వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి’ అన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత చిరంజీవితో కలిసి ప్రయాణం చేయడం ఆనందంగా ఉందని ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ఆనందం వ్యక్తం చేశారు.
అనిల్ సుంకర మాట్లాడుతూ ‘ఏడాది పాటు దర్శకుడు మెహర్ రమేష్ ఈ స్క్రిప్ట్ మీద పనిచేశారు. వాణిజ్య అంశాలు కలబోసిన చక్కటి ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు. ‘ఇప్పటివరకు నటిగా నాలోని ఉత్తమ ప్రతిభను ప్రదర్శించలేదని అనుకుంటున్నా. ఈ సినిమా ఆ లోటును తీర్చుతుందని భావిస్తున్నా’ అని తమన్నా తెలిపింది. ఈ సినిమాకు పనిచేయడంతో తన కల నిజమైందని సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ తెలిపారు.
కీర్తి సురేష్, రఘుబాబు, రావు రమేష్, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీగౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం: మహతి స్వరసాగర్, కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికపాటి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, స్క్రిప్ట్ పర్యవేక్షణ: సత్యానంద్, దర్శకత్వం: మెహర్ రమేష్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Keerthy Suresh: చెల్లెలు పాత్ర కోసం రెండు కోట్ల రెమ్యునరేషనా..!
చిరంజీవితో ఆ 45 నిమిషాలు మరిచిపోలేను.. సుధాకర్ ఎమోషన్
mega154 | చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో?
Tamannah: తమన్నా ఖాతాలో సరికొత్త రికార్డ్.. తగ్గేదే లే అంటున్న మిల్కీ బ్యూటీ..!
పూరీ, చిరంజీవి కాంబినేషన్ రెడీ.. ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

