Allu Arjun | చిరంజీవి బర్త్ డే..అల్లు అర్జున్ ఎక్కడ..?
టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 66వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం మిస్ అయ్యాడు.

టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 66వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బయట ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అతి తక్కువ మందితో తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు చిరంజీవి. గతేడాది కరోనా కారణంగా ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అప్పుడు అభిమానులు, ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు ఎవరు చిరంజీవి ఇంటికి రాలేదు. ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉండటంతో చిరు ఇంటికి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, అభిమానులు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పుట్టినరోజు వేడుకలు జరుగుతూనే ఉన్నాయి.
మరోవైపు మెగాస్టార్ కూడా అందరిని ప్రేమతో పలకరిస్తూ..విష్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపాడు. మధ్యాహ్నం వరకు సినీ పెద్దలకు సమయం ఇచ్చిన మెగాస్టార్.. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకున్నాడు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్ ఇలా మెగా హీరోలంతా కనిపించారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ..ఈ వేడుకల్లో అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం మిస్ అయ్యాడు.
ఎంత వెతికినా కూడా బన్నీ జాడ ఎక్కడా కనిపించలేదు. దాంతో సోషల్ మీడియాలో మళ్లీ వార్తలు మొదలయ్యాయి. చిరంజీవితో అల్లు అర్జున్ కు పొసగడం లేదని.. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది అంటూ కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి. అగ్నికి వాయువు తోడైనట్లు రాంగోపాల్ వర్మ కూడా దీనిపై ఒక ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ సెల్ఫ్ మేడ్ మెగాస్టార్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఆయనకు ఇలా చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు వచ్చి భజన చేయాల్సిన అవసరం లేదు అంటూ సెటైర్లు వేశాడు. దాంతో నిజంగానే బన్నీ, చిరంజీవి మధ్య ఏదో జరుగుతుంది అంటూ వార్తలొచ్చాయి.
కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదు.. అల్లు అర్జున్ చిరంజీవి బర్త్ డే వేడుకలకు రాకపోవడానికి ప్రధాన కారణం పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడమే అని మెగా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయ్యింది. దాంతో బ్రేకులు తీసుకోకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు అల్లు అర్జున్. అక్కడ తీరిక లేకపోవడం వల్లే మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలకు అల్లుఅర్జున్ రాలేదు. అంతే తప్ప మరి ఇతర కారణాలు లేవు అంటున్నారు మెగా కుటుంబ సభ్యులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

