అది అత్యాచారం కాదా?!
‘గృహ హింస’పై ఎన్నో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చాయి. నాలుగు గోడల మధ్య, కుటుంబ సభ్యుల చేతుల్లోనే మహిళలు పడే హింసను కళ్లకు కట్టాయి. సమాజానికి అవగాహన కల్పించాయి. అయితే, ‘మారిటల్ రేప్' వంటి సున్నితమైన అంశాలు మాత్రం తక్కువగా తెరకెక్కాయి.
చిరయ్యా
జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: దివ్యా దత్తా, సంజయ్ మిశ్రా, ప్రసన్న బిష్త్, సిద్ధార్థ్ షా,
టినూ ఆనంద్, సరితా జోషి తదితరులు, దర్శకత్వం: శశాంత్ షా
‘గృహ హింస’పై ఎన్నో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చాయి. నాలుగు గోడల మధ్య, కుటుంబ సభ్యుల చేతుల్లోనే మహిళలు పడే హింసను కళ్లకు కట్టాయి. సమాజానికి అవగాహన కల్పించాయి. అయితే, ‘మారిటల్ రేప్’ వంటి సున్నితమైన అంశాలు మాత్రం తక్కువగా తెరకెక్కాయి. భార్య అంగీకారం లేకుండా భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొంటే.. అది రేప్ కిందకే వస్తుందనే చర్చ ఎప్పటి నుంచో ఉన్నది. ఆ పాయింట్ ఆధారంగానే.. దర్శకుడు శశాంత్ షా ‘చిరయ్యా’ వెబ్ సిరీస్‌ను రూపొందించాడు.
జియో హాట్‌స్టార్ వేదికగా విడుదల చేశాడు. ‘మారిటల్ రేప్’ గురించి భారతీయులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సిరీస్ తెరకెక్కింది. అందుకే, హిందీ సహా ఏకంగా 12 భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నది. కథలోకి వెళ్తే.. కమలేష్ (దివ్యా దత్తా) ఇంటి పెద్ద కోడలు. తన భర్త తమ్ముడు, మరిది అరుణ్ (సిద్ధార్థ్ షా) అంటే ఆమెకు ఎంతో అభిమానం.
మంచి వ్యక్తి అనీ, ఏ తప్పూ చేయడని కమలేష్ నమ్మకం. మరోవైపు పూజ (ప్రసన్న బిష్త్).. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటుంది. పెళ్లి చూపులకు వచ్చిన అరుణ్‌తో వివాహబంధంలోకి అడుగుపెడుతుంది. అయితే, పెళ్లి తర్వాత అరుణ్‌లోని రాక్షసుడు బయటికి వస్తాడు. పూజకు ఇష్టం లేకపోయినా ఆమెను బలవంతంగా అనుభవిస్తుంటాడు. భార్యను ఓ సైకోలా హింసిస్తుంటాడు.
ఈ విషయాన్ని తన తల్లి దృష్టికి తీసుకెళ్తుంది పూజ. అయినా, తల్లితో సహా ఎవరూ ఆమెకు సహాయం చేయరు. పైగా.. భర్తతో సర్దుకుపోవాలని సలహా ఇస్తారు. ఈ క్రమంలో పూజ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? భర్తతో బలవంతపు శృంగారాన్ని తప్పించుకోవడానికి ఎలా ప్రయత్నిస్తుంది? భర్త బారి నుంచి పూజ ఎలా బయటపడుతుంది? ఎంతో మంచివాడు అనుకుంటున్న కమలేష్‌కు.. మరిది నిజస్వరూపం తెలుస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ‘చిరయ్యా’ సిరీస్ చూడాల్సిందే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

