Bellamkonda Srinivas | ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేస్తున్న ఛత్రపతి రీమేక్
Chatrapathi Hindi Remake | పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన 'ఛత్రపతి' బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. 'వర్షం'తో తిరుగులేని హిట్‌ను అందుకున్న ప్రభాస్‌కు.. ఛత్రపతి ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది.
Chatrapathi Hindi Remake | పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఛత్రపతి’ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ‘వర్షం’తో తిరుగులేని హిట్‌ను అందుకున్న ప్రభాస్‌కు.. ఛత్రపతి ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాతో ప్రభాస్‌కు మాస్ ఆడియెన్స్ విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అలాంటి సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో డెబ్యూ ఇస్తున్నాడు. మాస్ సినిమాలకు పెట్టిన పేరైన వి.వి. వినాయక్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం ప్రకటన వచ్చిన సినిమా ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. ఒకానొక టైమ్‌లో ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజవుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. కాగా గతకొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఎలాంటివి రాకపోవడంతో అసలు ఈ సినిమా ఉందన్న విషయమే ప్రేక్షకులు మెల్లిమెల్లిగా మర్చిపోతున్నారు.
ఇలాంటి సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఛత్రపతి హిందీ రీమేక్‌ను మే5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రమోషన్లను జరిపే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఒకవేళ అదే డేట్ ఫిక్సయితే మాత్రం చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకైతే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు, అయితే బెల్లంకొండ సినిమాలు యూట్యూబ్‌లో హిందీ వెర్షన్‌కు మిలియన్లలో వ్యూస్ ఉన్నాయి. దాంతో ప్రమోషన్లను గ్రాండ్‌గా జరిపితే మంచి ఓపెనింగ్స్ వచ్చే చాన్స్ అయితే ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

