మలయాళంలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ‘చథా పచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్’ చిత్రాన్ని ఈ నెల 13న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది. రోషన్ మాథ్యూ, విశాల్ నాయర్, ఇషాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో రోషన్ మాథ్యూ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం తమ బృందం నాలుగు నెలల పాటు రెజ్లింగ్లో శిక్షణ తీసుకున్నదని, ముగ్గురు మిత్రుల నేపథ్యంలో నడిచే స్పోర్ట్స్ యాక్షన్ కామెడీ చిత్రమిదని తెలిపారు. వినోదాత్మకంగా సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఆకట్టుకుంటుందని సురేష్ ప్రొడక్షన్స్ ప్రవీణ్ తెలిపారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం: అద్వైత్ నాయర్.