Race Gurram | ‘రేస్ గుర్రం’ రీ-రిలీజ్లో ఫ్యాన్స్ హంగామా.. థియేటర్లలో నిజమైన గుర్రాలతో బన్నీ ఫ్యాన్స్ రచ్చ!
Race Gurram | టాలీవుడ్లో స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నాయి. కేవలం కేక్ కటింగ్స్, బ్యానర్లకే పరిమితం కాకుండా, వారి బ్లాక్‌బస్టర్ సినిమాలను రీ-రిలీజ్ చేస్తూ అభిమానులు పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లలో పాత సినిమాలను మళ్లీ విడుదల చేసి, అందులోని ఐకానిక్ సీన్స్‌ను రీక్రియేట్ చేస్తూ సెలబ్రేట్ చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.
Race Gurram | టాలీవుడ్లో స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నాయి. కేవలం కేక్ కటింగ్స్, బ్యానర్లకే పరిమితం కాకుండా, వారి బ్లాక్‌బస్టర్ సినిమాలను రీ-రిలీజ్ చేస్తూ అభిమానులు పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లలో పాత సినిమాలను మళ్లీ విడుదల చేసి, అందులోని ఐకానిక్ సీన్స్‌ను రీక్రియేట్ చేస్తూ సెలబ్రేట్ చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన రేస్ గుర్రం సినిమాను మేకర్స్ మళ్లీ థియేటర్లలోకి తీసుకువచ్చారు. బన్నీ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, శృతి హాసన్ గ్లామర్, బ్రహ్మానందం కామెడీతో అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం, రీ-రిలీజ్లోనూ అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తోంది.
అయితే ఈసారి అభిమానులు చేసిన హంగామా మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా, థియేటర్లకు నిజమైన గుర్రాలను తీసుకువచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. థియేటర్ బయట గుర్రాలపై స్వారీ చేస్తూ, బన్నీ పాటలకు డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్ చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వినూత్న సెలబ్రేషన్ చూసిన కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోతుండగా, మరికొందరు అభిమానుల క్రేజ్‌ను ప్రశంసిస్తున్నారు. థియేటర్ వద్దకు గుర్రాలను తీసుకురావడం వెరైటీ ఐడియా అయినప్పటికీ, ఇది కొంత వివాదానికీ దారితీస్తోంది.
అల్లు అర్జున్‌పై అభిమానులు చూపిస్తున్న ఈ ప్రేమ, అభిమానం పీక్స్‌లో ఉందని కొందరు అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ‘రేస్ గుర్రం’లా దూసుకుపోయిన ఈ సినిమా, ఇప్పుడు రీ-రిలీజ్లోనూ అదే జోష్‌ను కొనసాగిస్తూ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక బన్నీ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో చేస్తున్న మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. మనిషిలా సగం, మృగం లుక్‌లో సగం బన్నీ కనిపించడంతో ఈ మూవీ ఫ్యాన్స్‌కి మంచి ఫీస్ట్ అందించడం ఖాయం అంటున్నారు.
రేసు గుర్రం సినిమా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ లోకి గుర్రాలను తీసుకొచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ pic.twitter.com/yx5eDT7oOf
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- Horse
- Raaka
- race gurram
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

