బ్రహ్మానందం కొడుకు మరో సినిమా.. ఆగని గౌతమ్ దండయాత్ర..

Brahmanandam Son Gowtham | ఇండస్ట్రీలో కొంత మంది వారసులకు కొండంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా.. రవ్వంత అదృష్టం కలిసి రాదు. దాంతో వాళ్లకు టాలెంట్ ఉన్నా ఒక్కోసారి విజయాలు అందుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ కోవలోకే బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కూడా వస్తాడు. అప్పుడెప్పుడో 18 సంవత్సరాల కింద పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు గౌతమ్. రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో చంద్రబోస్ భార్య సుచిత్ర దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో దారుణంగా విఫలమైంది. ఆ తర్వాత తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు గౌతమ్.

బసంతి సినిమా కోసం స్టార్ హీరోలందరినీ ప్రమోషన్ కోసం వాడుకున్నాడు. కానీ అది కూడా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత మను అనే మరో సినిమాతో వచ్చాడు. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా బ్రహ్మానందం తనయుడికి కోరుకున్న బ్రేక్ ఇవ్వలేకపోయింది. కెరీర్లో ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా లేని గౌతమ్ తాజాగా మరో సినిమా మొదలు పెట్టాడు. ఆయన హీరోగా కొత్త సినిమా నవంబర్ 19న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. సుబ్బు చెరుకూరి దర్శకుడిగా ఓ యునీక్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందించనున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి నూతన దర్శకుడు విశ్వ క్లాప్ ఇచ్చాడు. ఈసారి కూడా రొటీన్‌కి భిన్నంగా ఉండే సబ్జెక్టు తోనే వస్తున్నాడు గౌతమ్. ఈ సినిమాలో మోనోఫోబియాతో బాధ పడుతున్న ఓ అప్‌కమింగ్ రైటర్ తన జీవితానికి ప్రమాదం ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిమించి బయట పడ్డాడు అనేది కథ. శ్రీరామ్ మడ్డూరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కె సంతోశ్ ఎడిటర్‌గా, మోహన్ చారి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా బ్రహ్మానందం తనయుడు హీరోగా తొలి విజయం అందుకుంటాడో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Brahmanandam | బ్రహ్మానందంను సినిమా నుంచి తొలగించిన నితిన్..?
బ్రహ్మానందం ఈజ్ బ్యాక్.. కొత్త దారిలో లెజెండరీ కమెడియన్..
జబర్దస్త్ కమెడీయన్‌ను ఫాలో అవుతున్న బ్రహ్మానందం!
చంద్రబాబు ఏడుపుపై తన మార్క్ సెటైర్లు వేసిన ఆర్జీవీ
Chennai heroines Club | నీకు నేను నాకు నువ్వు అంటున్న హీరోయిన్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

