Thunivu | డైలమాకు చెక్.. తునివు రిలీజ్ డేట్‌పై బోనీకపూర్ క్లారిటీ
అజిత్ కుమార్ (Ajith Kumar) నటిస్తున్న తాజా చిత్రం తునివు (Thunivu). ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అజిత్ స్టైలిష్ యాక్టింగ్‌తో సాగుతూ అభిమానులను ఖుషీ చేస్తోంది. కాగా తాజాగా అభిమానులకు విడుదల తేదీపై క్లారిటీ ఇస్తూ అధికారిక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
హెచ్ వినోథ్ (H Vinoth) డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటిస్తున్న తాజా చిత్రం తునివు (Thunivu). ఏకే 61వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో తెగింపు టైటిల్‌తో విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అజిత్ స్టైలిష్ యాక్టింగ్‌తో సాగుతూ అభిమానులను ఖుషీ చేస్తోంది. కాగా తాజాగా అభిమానులకు విడుదల తేదీపై క్లారిటీ ఇస్తూ అధికారిక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
హీస్ట్ థ్రిల్లర్ నేపథ్యంలో నో గట్స్ నో గ్లోరీ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న తునివు జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు నిర్మాత బోనీకపూర్ ట్వీట్ చేశారు. తునివు బాక్సాఫీస్ వద్ద విజయ్ నటిస్తోన్న వారిసుతో ఒకే రోజు బరిలోకి దిగుతుందా..? అనే డైలామాలో ఉన్న అభిమానులకు క్లారిటీ ఇస్తూ బోనీకపూర్ ట్వీట్ చేయడంతో రిలాక్స్ అవుతున్నారు మూవీ లవర్స్.
ఈ చిత్రంలో మలయాళ భామ మంజు వారియర్ హీరోయిన్గా నటిస్తోంది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ (Ghibran) సంగీతం అందిస్తున్నాడు. తునివు చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో జీస్టూడియోస్‌తో కలిసి బోనీకపూర్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, సముద్రఖని, మహానంది శంకర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తునివు చిత్రాన్ని తమిళంలో బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీ-జీస్టూడియోస్ విడుదల చేస్తుండగా.. తెలుగులో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ఐవీఐ ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్నాయి.
#Thunivu releasing worldwide in theatres – January 11th. #Ajithkumar #HVinoth @BoneyKapoor @ZeeStudios_ @BayViewProjOffl @RedGiantMovies_ @kalaignartv_off@NetflixIndia @SureshChandraa #RomeoPictures @mynameisraahul pic.twitter.com/3QqdyvrMlI
— Zee Studios South (@zeestudiossouth) January 4, 2023
చిల్లా చిల్లా లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

