సోదరికి కష్టం రానీయడు
విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘బిచ్చగాడు 2’. కావ్య థాపర్ నాయికగా నటిస్తున్నది. ఫాతిమా నిర్మాత. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హీరోలు అడివి శేష్, ఆకాష్ పూరి అతిథులుగా హైదరాబాద్లో నిర్వహించారు.
విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘బిచ్చగాడు 2’. కావ్య థాపర్ నాయికగా నటిస్తున్నది. ఫాతిమా నిర్మాత. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హీరోలు అడివి శేష్, ఆకాష్ పూరి అతిథులుగా హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ…‘తన కూతురి పెండ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు తండ్రి ఎలా బాధపడతాడో ప్రతి సినిమాను కష్టపడి రూపొందించి రిలీజ్ చేసేప్పుడు కూడా అలాగే ఉద్వేగానికి లోనవుతుంటాం. తొలి భాగం సినిమాలో ఉన్న ఎమోషన్స్ ఈ చిత్రంలోనూ కనిపిస్తాయి. కొన్నేండ్లుగా తెలుగు ప్రేక్షకులు నన్ను అభిమానిస్తున్నారు.
ఈ సినిమా మీద కూడా మీ ఆదరణ చూపిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. అడివి శేష్ మాట్లాడుతూ…‘మనం కథలు రాసి సినిమాలు చేస్తున్నాం గానీ విజయ్ ఆంటోనీ ఎడిటింగ్, సంగీత బాధ్యతలు కూడా వహిస్తున్నారు. ‘బిచ్చగాడు’ నా ఫేవరేట్ మూవీ. ఈ సీక్వెల్ కూడా అలాగే ఆకట్టుకుంటుందని కోరుకుంటున్నా’ అన్నారు. నాయిక కావ్య థాపర్ మాట్లాడుతూ..‘ఈ చిత్రంలో హేమ పాత్రలో కనిపిస్తాను. ఈ చిత్రంతో నాకు విజయ్, ఫాతిమా రూపంలో మంచి మిత్రులు దొరికారు. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఫాతిమా విజయ్, గీత రచయిత భాషా శ్రీ, డిస్ట్రిబ్యూటర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్పై హరీశ్రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

