బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) నటించిన చిత్రం భూల్ భూలయా 2 (Bhool Bhulayya 2). హార్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన భూల్ భూలయా చిత్రానికి సీక్వెల్‌గా వచ్చింది. అనీష్ బజ్మీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ప్రాజెక్టులో కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించగా..రాజ్‌పాల్ యాదవ్, టబు కీ రోల్స్ పోషించాడు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల పంట పండించింది. తాజా అప్ డేట్ ప్రకారం ఈ ప్రాజెక్టు రూ.180 కోట్ల మార్కును దాటేసినట్టు సమాచారం.
తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చింది. జులై 17న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో విడుదల కానుంది భూల్ భూలయ్యా 2. సిల్వర్ స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని ఫుల్ ఎంజాయ్ చేశారు ప్రేకకులు. ఇక మరో నెల రోజుల్లో డిజిటల్ ప్లాట్ ఫాంలో కూడా సందడి చేసేందుకు రెడీ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వెంటాడుతున్న బాలీవుడ్‌కు ఈ సినిమాతో మంచి సక్సెస్ దక్కింది.