Bharateeyudu -2 | సేనాపతి వచ్చేస్తున్నాడు.. జూలైలో పాన్ఇండియా స్థాయిలో..
దేశాన్ని కేన్సర్‌లా పట్టి పీడిస్తున్న అవినీతిపై స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి చేసిన పోరాటమే ఇతివృత్తంగా 1996లో విడుదలైన సినిమా ‘భారతీయుడు’.
Bharateeyudu -2 | దేశాన్ని కేన్సర్‌లా పట్టి పీడిస్తున్న అవినీతిపై స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి చేసిన పోరాటమే ఇతివృత్తంగా 1996లో విడుదలైన సినిమా ‘భారతీయుడు’. ఈ సినిమా ఆరోజుల్లోనే పాన్ఇండియా హిట్‌గా నిలిచింది. దానికి సీక్వెలే ‘భారతీయుడు2’. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూలైలో పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
‘భారతీయుడు’ని మించేలా విజువల్ వండర్‌గా ‘భారతీయుడు 2’ను దర్శకుడు శంకర్ ఆవిష్కరిస్తున్నట్టు చిత్రబృదం చెబుతున్నది. అవినీతిపై సమరశంఖం పూరించిన స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా మరోసారి కమల్‌హాసన్ తన నటవిశ్వరూపం చూపించనున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ని వినూత్నంగా ముంబయిలోని స్టార్‌స్పోర్ట్స్ ఛానల్లో ప్రారంభించడం విశేషం.
జూన్ 1న చెన్నయ్‌లో ఈ మూవీ ఆడియో వేడుకను ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నట్టు చిత్ర నిర్మాత సుభాస్కరన్ తెలిపారు. ఎస్.జె.సూర్య, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీశంకర్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్, జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహా, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుథ్ రవిచంద్రన్, కెమెరా: రవివర్మన్, ఎడిటింగ్: ఎ.శ్రీకర్‌ప్రసాద్, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

