Chatrapathi | మాస్‌లుక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్.. ఛత్రపతి టైటిల్ పోస్టర్ రిలీజ్
Chatrapathi Movie Firstlook Poster | బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో తన అదృష్టం పరిక్షించుకోవడానికి రెడి అయిపోయాడు. తెలుగులో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. మాస్కు పెట్టిన పేరైన వి.వి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Chatrapathi Movie Firstlook Poster | పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఛత్రపతి’ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ‘వర్షం’తో తొలి హిట్ అందుకున్న ప్రభాస్‌కు.. ఛత్రపతి తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాతో ప్రభాస్‌కు మాస్ ఆడియెన్స్ విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అలాంటి సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో డెబ్యూ ఇస్తున్నాడు. మాస్ సినిమాలకు పెట్టిన పేరైన వి.వి. వినాయక్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం ప్రకటన వచ్చిన సినిమా ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. ఒకానొక టైమ్‌లో ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజవుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా గతకొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు రాకపోవడంతో అసలు ఈ సినిమా ఉందన్న విషయమే ప్రేక్షకులు మెల్లిమెల్లిగా మర్చిపోతున్నారు.
ఇలాంటి సమయంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ విడుదల తేదీని అనౌన్స్‌చేశారు. ఈ సినిమాను ఒరిజినల్ టైటిల్ అయిన ఛత్రపతినే ఫిక్స్ చేశారు. సమ్మర్ కానుకగా మే 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లో బెల్లంకొండ శ్రీనివాస్ కండలు తిరిగిన దేహంతో చేతిలో చెంబు పట్టుకుని సముద్రం వైపు తిరిగి ఉన్నాడు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే సినిమాపై చిత్రబృందం మంచి బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతి లాల్ నిర్మిస్తున్నాడు. మరి ఈ రీమేక్ ఒక్క హిందీ బాషలోనే విడులవుతుందా? లేదంటే పాన్ ఇండియా లెవల్లో విడుదవుతుందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Remake of #Prabhas & @ssrajamouli’s “Chatrapathi” starring @BSaiSreenivas#Chatrapathi in cinemas on 12th May, 2023@Penmovies @JayantilalGada @timesmusichub #PenStudios pic.twitter.com/BXmXI52k3N
— Rajasekar (@sekartweets) March 27, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

