Beast OTT | మరి కొన్ని గంటల్లో ‘బీస్ట్’ ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పుడు? ఎక్కడంటే?
Beast OTT Streaming Time | కోలీవుడ్ స్టార్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 13న విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ‘డాక్టర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నెల్సన్ కుమార్ ఈ చిత్రం తెరకెక్కించడంతో ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు విజయ్ అభిమానులను సైతం తీవ్రంగా నిరాశపరిచింది. కథ బాగానే ఉన్న కథనం స్లోగా ఉందని, కామెడీ అన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.
పైగా ఈ చిత్రం విడుదలైన మరుసటి రోజే ‘కేజీఎఫ్-2’ విడుదలవడం బీస్ట్‌కు గట్టి పోటీనిచ్చింది. ‘మాస్టర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ నుంచి ఈ చిత్రం రావడంతో తెలుగులో 10కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఫైనల్‌గా ఈ చిత్రం రూ.6.32 కోట్ల వరకు కలెక్షన్లను సాధించి డిస్ట్రిబ్యూటర్లకు రూ.3.68 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థలైన ‘సన్ ఎన్ఎక్స్టి’, ‘నెట్‌ఫ్లిక్స్’లలో ఈ చిత్రం మంగళవారం అర్థరాత్రి 12గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

