Ugly Story | టాలీవుడ్ నటుడు శ్రీ నందు మరియు అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘అగ్లీ స్టోరీ’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం జూన్ 05 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘ఆహా’ (Aha Video) లో తెలుగుతో పాటు తమిళ భాషలోనూ డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది.
ప్రణవ్ స్వరూప్ దర్శకత్వంలో, రియా జియా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా కీలక పాత్రలు పోషించగా, శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు. ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, ఆమె మరొకరిని ప్రేమిస్తోందనే నిజాన్ని తట్టుకోలేక సైకోగా ఎలా మారాడు, ఆ తిరస్కరణ ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసింది అనే ఆసక్తికరమైన డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. థియేటర్లలో ఈ విభిన్నమైన థ్రిల్లర్‌ను మిస్ అయిన ప్రేక్షకులు ఈ రాత్రి నుండి ‘ఆహా’ వేదికగా వీక్షించవచ్చు.