Tharun Bhascker | చెత్తను పంచదార పూసి ఇస్తే ఆడియన్స్ నమ్మరు.. రొటీన్ సినిమాలపై తరుణ్ భాస్కర్ కామెంట్స్
Director Tharun Bhascker | టాలీవుడ్ యువతలో ట్రెండ్ సెట్ చేసిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'ఈఎన్ఈ రిపీట్' (ENE Repeat).
Director Tharun Bhascker | టాలీవుడ్ యువతలో ట్రెండ్ సెట్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat). ఈ సినిమా ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూల జోరులో టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా తెలుగు సినిమా కంటెంట్ మరియు నేటి ప్రేక్షకుల అభిరుచిపై ఆయన స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా నిలిచాయి.
మలయాళంలో తమిళంలో నడిచిన అదే సినిమా ఫార్మూలా తెలుగులో ఎందుకు పనిచేయట్లేదు అనే విషయంపై తరుణ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు తెలివైనవారు ఏదీపడితే అది పంచదార పూసి ఇస్తే.. వాటిని చాక్లెట్లు (క్యాండీస్) లాగా తింటారని నేను అనుకోవడం లేదు అని కుండబద్దలు కొట్టారు. అంటే నేటి ప్రేక్షకులు చాలా తెలివైనవారనీ, రొటీన్ కంటెంట్‌ను ఎంత కలరింగ్ ఇచ్చి, గ్రాండ్‌గా చూపించాలని చూసినా వారు మోసపోరని ఆయన స్పష్టం చేశారు. కేవలం కమర్షియల్ ఫార్ములాలు, బోరింగ్ కథలతో ప్రేక్షకులను మభ్యపెట్టలేమని, కంటెంట్‌లో నిజాయితీ ఉంటేనే వారు ఆదరిస్తారని ఆయన నమ్ముతున్నారు.
మొదటి భాగం ఎంతటి కల్ట్ స్టేటస్‌ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు వస్తున్న సీక్వెల్ కూడా కేవలం క్యాషియర్ ట్రిక్ లాంటిది కాకుండా, మైండ్ అండ్ హార్ట్ నుంచి వచ్చిన ప్యూర్ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్ బాండింగ్‌తో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఏదేమైనా, తరుణ్ భాస్కర్ సినిమాలపై ఉంచే క్లారిటీ, ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే ‘ENE Repeat’ తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సరికొత్త మేజిక్ రిపీట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tharun Bhascker | చెత్తను పంచదార పూసి ఇస్తే ఆడియన్స్ నమ్మరు.. రొటీన్ సినిమాలపై తరుణ్ భాస్కర్ కామెంట్స్
Kedarnath Temple: కేదార్నాథ్ ఆలయం మూసివేత
Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

