పనాజీ: పద్మశ్రీ, బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఇవాళ తెల్లవారుజామున గోవాలో కన్నుమూశారు. అయితే నానా పటేకర్ ఇవాళ తెల్లవారుజామున 3.30 నిమిషాలకు తన స్నేహితుడికి మెసేజ్ చేశాడు. ఆరోగ్యం బాగా లేదని ఆయన టెక్ట్స్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే నానా పటేకర్ తన నివాసంలో ప్రాణాలు విడిచారు. పనాజీ సమీపంలో ఉన్న డోనా పౌలాలో ఉన్న అపార్ట్మెంట్లో అతను స్పృహలేకుండా పడిపోయారు. 75 ఏళ్ల పటేకర్‌ను ఆస్పత్రికి తరలించారు. హార్ట్ అటాక్ వల్ల మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నానా పటేకర్ ఓ కేర్‌టేకర్‌తో కలిసి తన అపార్ట్మెంట్లో ఉంటున్నట్లు సీనియర్ డాక్టర్ శేఖర్ సల్కార్ తెలిపారు.
నానా పటేకర్ స్నేహితుడు ఆ మెసేజ్‌ను ఉదయం 4 గంటలకు చూశాడు. ఆ తర్వాత అతను వెంటనే పటేకర్ ఇంటికి వెళ్లాడు. కేర్‌టేకర్‌ను అలర్ట్ చేయడంతో .. అతను ఆస్పత్రికి కాంటాక్ట్ అయ్యాడు. వెంటనే పటేకర్ ఇంటికి అంబులెన్స్ పంపారు. పటేకర్ ఇంటికి ఆస్పత్రి 5 నిమిషాల దూరంలో ఉంది. అంబులెన్స్‌లోనే చికిత్సను అందించినట్లు డాక్టర్ సల్కార్ తెలిపారు. గుండెపోటుతో వచ్చిన నానా పటేకర్‌కు ఆస్పత్రి డాక్టర్లు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేశారు.
పటేకర్ ఎంతకీ కోలుకోకపోవడంతో.. ఉదయం 5.10 నిమిషాలకు అతను మరణించినట్లు ప్రకటించారు. మెడికో-లీగల్ కేసును నమోదు చేశారు. పోస్టుమార్టమ్ కోసం అతని పార్దీవదేహాన్ని గోవా మెడికల్ కాలేజీకి పంపించారు. వైద్య పరీక్ష ద్వార చావుకు అసలు కారణం తెలవనున్నది. పరిందా, ప్రహార్, తిరంగ, క్రాంతివీర్, కామోషి లాంటి హిట్ చిత్రాలను ఆయన నటించాడు. ఉత్తమ నటనకు గాను నానా పటేకర్ మూడు సార్లు జాతీయ ఫిల్మ్ అవార్డులు గెలుచుకున్నారు.