Arjun | నా జీవితంలో ఆమెని చాలా మిస్ అవుతున్నా.. ఎమోషనల్ అయిన యాక్షన్ కింగ్ !
Arjun | దక్షిణాది సినీ పరిశ్రమలో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ అనే తేడా లేకుండా ఎన్నో భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడా తనదైన శైలిలో మెప్పిస్తూ ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతున్నారు.
Arjun | దక్షిణాది సినీ పరిశ్రమలో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ అనే తేడా లేకుండా ఎన్నో భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడా తనదైన శైలిలో మెప్పిస్తూ ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో తనదైన స్టైల్‌తో ఆకట్టుకోవడంతో పాటు, తెరపై ఆయన చూపించే గంభీరమైన వ్యక్తిత్వం కూడా అభిమానులను విశేషంగా ఆకర్షించింది. అయితే అర్జున్ సినీ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో తనకు వెంటనే అవకాశాలు రాలేదని అర్జున్ తెలిపారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సి వచ్చిందని చెప్పారు. అయితే జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా తీసుకున్నానని, ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగానని పేర్కొన్నారు.నటనపై ఉన్న ఆసక్తి, కష్టపడే తత్వం, సినిమాలపై ఉన్న నిబద్ధతే తనను ఈ స్థాయికి తీసుకువచ్చాయని అర్జున్ చెప్పుకొచ్చారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, అదే సమయంలో తన జీవితంలో ఎంతోమంది మంచి స్నేహితులు కూడా చేరారని గుర్తుచేసుకున్నారు.
తన సినీ జీవితంలో ఏర్పడిన స్నేహాల గురించి మాట్లాడిన అర్జున్.. ప్రముఖ నటుడు జగపతిబాబుతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. అయితే తన స్నేహితుల గురించి ప్రస్తావించిన సమయంలో దివంగత నటి సౌందర్య పేరును ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అర్జున్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను ఇప్పటికీ ఎంతో మిస్ అవుతున్నానని చెబుతూ, సౌందర్యతో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. నా జీవితంలో మిస్ యూ అనే పదానికి అర్థం ఏంటని వెతికితే.. అది సౌందర్యను మిస్ అవ్వడమే అంటూ అర్జున్ చెప్పిన మాటలు ఆమెతో ఆయనకున్న అనుబంధాన్ని తెలియజేస్తాయి.సౌందర్య మరణించిన తర్వాతే ఆమె తన జీవితంలో ఎంత ప్రత్యేకమైన వ్యక్తో మరింతగా అర్థమైందని అర్జున్ తెలిపారు. అందం, అభినయం, ఆకర్షణతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన గొప్ప నటి సౌందర్య అని ఆయన కొనియాడారు. ఆమె వ్యక్తిత్వం, సహజమైన నటన, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే తీరు ఎంతో ప్రత్యేకమని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

