లొకేషన్లో వాగ్వివాదం
షూటింగ్ టైమ్‌లో క్రియేటివ్ డిఫరెన్స్ కామన్. డైరెక్టర్‌కీ డీవోపీకీ మధ్య ఈ విషయంలో గొడవలెక్కువగా వస్తుంటాయి. మూవీ మేకింగ్‌పై నిర్మాతకు అవగాహన ఉంటే కూడా సెట్లో వాదనలకు ఆస్కారం ఉంటుంది.
షూటింగ్ టైమ్‌లో క్రియేటివ్ డిఫరెన్స్ కామన్. డైరెక్టర్‌కీ డీవోపీకీ మధ్య ఈ విషయంలో గొడవలెక్కువగా వస్తుంటాయి. మూవీ మేకింగ్‌పై నిర్మాతకు అవగాహన ఉంటే కూడా సెట్లో వాదనలకు ఆస్కారం ఉంటుంది. ఈ మధ్య సెట్స్‌లో హీరోల జోక్యం కూడా ఎక్కువైందని, కొందరు హీరోలైతే డైరెక్టర్లకీ, డీవోపీలకూ షాట్ ఎలా పెట్టాలో కూడా చెబుతున్నారనీ ఇన్సైడ్ టాక్.. ఈ విషయంలో బాలీవుడ్ రెండాకులు ఎక్కువే చదివింది. అక్కడ హీరోయిన్లు కూడా జోక్యం చేసేసుకుంటున్నారట.
వివరాల్లోకెళ్తే. యష్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై లేడీ స్పై థ్రిల్లర్‌గా ‘ఆల్ఫా’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అలియాభట్ లీడ్‌రోల్ చేస్తున్నది. శివ్రావెల్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్లో అలియాభట్ జోక్యం అధికమవ్వడంతో లొకేషన్లో పెద్ద గొడవే జరిగిందట. లొకేషన్లో దర్శకుడు శివ్రావెల్కు క్రియేటివ్ అవుట్పుట్స్ని అలియా ఎక్కువగా ఇస్తుండటం అసలు గొడవకు కారణమైందని వినికిడి. యాదృశ్చికంగా బాబీడియోల్ కాంబినేషన్ సీన్స్ తీస్తున్నప్పుడు కూడా ఇది జరిగిందట.
ఈ విషయంలో కొంతవరకూ బాబీడియోల్ సర్దుకుపోయినా.. వ్యవహారం శృతి మించడంతో అభ్యంతరం తెలియజేయక బాబీడియోల్కి తప్పిందికాదు. దాంతో ఇద్దరి మధ్య ఓ స్థాయిలో వాగ్వివాదం జరిగిందట. ఈ గొడవను చల్లార్చి, షూటింగ్‌ను సజావుగా నడిపించేందుకు దర్శక,నిర్మాతలు చాలా కష్టపడాల్సివచ్చిందట. ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఈ విషయంపై కథనాలు వెలువడుతున్నాయి. ‘అల్ఫా’ సినిమా విషయంలో అలియా అధికంగా జోక్యం చేసుకోవడానికి కారణం యష్‌రాజ్ ఫిల్మ్స్ గత చిత్రాలైన వార్ 2, మర్దానీ 3 చిత్రాల ఫలితాలేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

