Animal Movie | రూ.600 కోట్లు క్రాస్.. బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ సునామీ
Animal Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం 'యానిమల్. అర్జున్ రెడ్డి (Arjun reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది.
Animal Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. అర్జున్ రెడ్డి (Arjun reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. నాన్ హాలీడేస్ (వీక్ డేస్) లోనూ హౌల్ఫుల్ షోస్‌తో ప్రదర్శితమౌతూ, కాసుల వర్షం కురిపిస్తోంది.
రీసెంట్గా ఈ సినిమా 500 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం 8 రోజులకు గాను రూ. 600 కోట్ల మార్క్‌ను అందుకుంది.. కాగా, ఎనిమిదో రోజైన శుక్రవారం ఒక్క హిందీలోనే రూ. 21.56 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
The Blockbuster’s Triumph continues 🪓
Book your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/F65Wrnn63c
— Animal The Film (@AnimalTheFilm) December 9, 2023
ఈ సినిమా కథలోకి వెళితే.. విజయ్ (రణబీర్‌కపూర్) నాన్న పిచ్చోడు. చిన్నప్పట్నుంచీ తండ్రి అంటే అలవిమాలిన ప్రేమ. నాన్నే అతని ఓ సూపర్‌హీరో. కానీ తండ్రి నుంచి మాత్రం అతను ఆశించిన ప్రేమ దక్కదు. అయినా సరే నాన్నంటే మాత్రం పిచ్చి. తన కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు. తనవాళ్లకు ఏమైనా చిన్న సమస్య వచ్చినా వైల్డ్‌గా రియాక్టవుతుంటాడు. ఆ కారణంచేత తండ్రి కోపానికి గురవుతుంటాడు. ఇంట్లోవాళ్లకు ఇష్టంలేని పెళ్లి చేసుకొని కుటుంబానికి దూరమైన విజయ్, కొన్నాళ్ల తర్వాత భార్యాపిల్లలతో కలిసి తన ఇంటికి చేరుకుంటాడు. అప్పడే తెలుస్తుంది అతనికి తన తండ్రి ఆపదలో ఉన్నాడని. తన తండ్రిపై జరిగిన హత్యాప్రయత్నం గురించి తెలుసుకొని, దీనికి కారణమైన వాళ్లను వెతికి చంపాలనుకుంటాడు? ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన సమస్యలేంటి? అనుకున్నది ఎలా సాధించాడు? నాన్న ప్రేమను ఎలా పొందాడు? అనేది మిగితా కథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

