Anasuya – Roja | అత్తా vs కోడలు.. అనసూయని ఆంటీ అంటూ తెగ ట్రోల్ చేసిన రోజా
Anasuya - Roja | జబర్ధస్త్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ.ఈ క్రేజ్‌తో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. అయితే ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో మళ్లీ బుల్లితెరవైపు ఆసక్తి చూపుతుంది. ఈ క్రమంలో ఆమె "కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్" షోతో పాటు, జీ తెలుగు ప్రసారం చేస్తున్న "డ్రామా జూనియర్స్ సీజన్ 8" లో జడ్జ్‌గా కనిపిస్తోంది.
Anasuya – Roja | జబర్ధస్త్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ.ఈ క్రేజ్‌తో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. అయితే ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో మళ్లీ బుల్లితెరవైపు ఆసక్తి చూపుతుంది. ఈ క్రమంలో ఆమె “కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్” షోతో పాటు, జీ తెలుగు ప్రసారం చేస్తున్న “డ్రామా జూనియర్స్ సీజన్ 8” లో జడ్జ్‌గా కనిపిస్తోంది.ఈ షోలో రోజా, అనిల్ రావిపూడి సహజడ్జ్లుగా ఉన్నారు. యాంకర్‌గా సుడిగాలి సుధీర్ షోని హోస్ట్ చేస్తున్నాడు. అయితే రీసెంట్గా ఈ షోకి సంబంధించి ప్రోమో విడుదల కాగా, ఇందులో అనసూయ, రోజాల మధ్య జరిగిన సరదా సంభాషణ అందర్నీ ఆకట్టుకుంది.
ఒక స్కిట్లో భాగంగా రోజా అనసూయను “అత్తా” అంటూ పిలవడంతో సెట్లో అందరూ షాక్ అయ్యారు. “నువ్వు రంగమ్మత్తగా నటించావు కదా… అత్తలా కనిపిస్తున్నావ్ అందుకే ఆ పాత్ర వచ్చిందేమో!” అంటూ రోజా సరదాగా పంచ్ వేసింది. అదే నన్ను చూసి ఉంటే శ్రీవల్లి క్యారెక్టర్ ఇచ్చేవారని రోజా అనడంతో, అల్లు అర్జున్‌కి పీలింగ్స్ వచ్చి ఉండేవో లేదో తెలియదు గానీ ఆడియెన్స్ కి మాత్రం పీలింగ్స్ చచ్చేవి అంటూ అనసూయ అంటుంది. దీంతో అటు అనసూయ, ఇటు రోజా మధ్య పరిస్థితి హీటెక్కుతుంది. ఆ తర్వాత అనసూయ ఓ కార్డ్ తెచ్చి రోజాకి ఇస్తూ.. రేపు మా ఇంట్లో బారసాల, మీరు తప్పకుండా రావాలి అని అంటుంది. ఎవరికీ అని అడగ్గా నాకే అంది అనసూయ. దాంతో రోజాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వెంటనే రేపు అయితే నాకు కుదరదు , నా పుట్టెంటికలు తీయాల్సి ఉంటుంది అని చెప్పి షాకిచ్చింది.
అనంతరం ఎవరికి వయసు ఎక్కువుందో అందరు చెబుతారు, మీరు ఒకసారి అటు చూడండి అంటూ సూర్యకాంతంతో దిగిన పాత ఫొటోని అనసూయ చూపిస్తుంది. దాంతో ఉలిక్కిపడ్డ రోజా.. గాంధీతో ఉన్న అనసూయ పిక్ చూపిస్తుంది. దీంతో సుధీర్ కల్పించుకుని `అనసూయగారు నాకు తెలియదు మీరు ఫ్రీడమ్ ఫైటర్` అని అనడంతో నవ్వులు పూస్తాయి. అత్తా వర్సెస్ కోడలు అనే కాన్సెప్ట్ లో భాగంగా అనసూయ, రోజా ఇలా అత్తా కోడలిగా కామెడీ స్కిట్ ప్రదర్శించి నవ్వించారు. అయితే ఈ ఫుల్ కామెడీ స్కిట్ శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారమవుతుంది. “అత్తా వర్సెస్ కోడలు” అనే కాన్సెప్ట్‌లో అనసూయ, రోజాలఫన్నీ ట్రోల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

