Ananya Nagalla | ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ టాపిక్ తెరపైకి రావడం కొత్తేమీ కాదు. టాలీవుడ్, కోలీవుడ్ , బాలీవుడ్‌తోపాటు ఇతర ఇండస్ట్రీల నుంచి ఎవరో కాస్టింగ్ కౌచ్ అంశం గురించి మాట్లాడుతుంటారు. మల్లేశం సినిమాతో హీరోయిన్గా బ్రేక్ అందుకుంది తెలుగు భామ అనన్య నాగళ్ల (Ananya Nagalla). ఆ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్‌లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. అనన్య నాగళ్లను ఈ అంశం గురించి అడుగగా.. అదృష్టవశాత్తు తనకెప్పుడు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదని చెప్పింది.
తెలుగు ఇండస్ట్రీలో చాలా కాస్టింగ్ కౌచ్ ఉందని విన్నా. కానీ ఎవరూ అలాంటి ప్రవర్తనతో తన దగ్గరకు రాలేదని చెప్పుకొచ్చింది. మొదల సంప్రదాయ లుక్‌లో మెరిసిపోయిన ఈ బ్యూటీ ఆ తర్వాత సోషల్ మీడియాలో బోల్డ్ అవతార్‌లో కనిపిస్తూ.. నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
అనన్య నాగళ్ల ప్రస్తుతం Tantra టైటిల్‌తో తెరకెక్కుతున్న హార్రర్ డ్రామాలో నటిస్తోంది. మార్చి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ రఘుముద్రి, టెంపర్ వంశీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Tantra ట్రైలర్..