Trisha | ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంతో సెకండ్ ఇన్సింగ్స్‌లో విజయాల బాట పట్టింది సీనియర్ కథానాయిక త్రిష. ఇరవైఏళ్లకుపైగా కెరీర్లో కొనసాగుతున్న ఈ అమ్మడు ఇప్పటికీ వన్నె తరగని అందంతో అలరారుతున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో అరడజనుకుపైగా సినిమాలున్నాయి. అవన్నీ భారీ చిత్రాలే కావడం విశేషం. ఇక తెలుగులో ఈ భామ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నది. ‘స్టాలిన్’ తర్వాత వీరిద్దరు మరలా జోడీ కట్టడం విశేషం. ఇటీవలే ఈ సినిమా సెట్స్‌లో త్రిష జాయిన్ అయిందని తెలిసింది. ఇదిలా వుండగా ఈ సినిమాలో త్రిష పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది.
సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా భిన్న కాల వ్యవధుల్లో సాగుతుందని, ఇందులో త్రిష ద్విపాత్రాభినయంలో కనిపించనుందని అంటున్నారు. కథాగమనంలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, తెలుగులో త్రిషకు పూర్వ వైభవం తీసుకొచ్చే పాత్ర ఇదని చెబుతున్నారు. ప్రస్తుతం త్రిష మలయాళంలో రామ్, ఐడెంటిటీచిత్రాలను చేస్తున్నది. తమిళంలో మణిరత్నం-కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.