Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Amitabh Bachchan | బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. వైద్యులు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో, కొంతకాలం పాటు సోషల్ మీడియా పోస్టులకు విరామం ఇవ్వనున్నట్లు అమితాబ్ వెల్లడించారు.
Amitabh Bachchan | బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. వైద్యులు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో, కొంతకాలం పాటు సోషల్ మీడియా పోస్టులకు విరామం ఇవ్వనున్నట్లు అమితాబ్ వెల్లడించారు. దీంతో ఆయనకు ఏమైందనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ, కోలుకోవడానికి మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఈ కారణంగా తాను ప్రస్తుతం పోస్టులు చేయలేకపోతున్నానని, అందుకు అభిమానులు క్షమించాలని కోరారు.
సాధారణంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన ఆలోచనలు, అనుభవాలను అభిమానులతో పంచుకునే అమితాబ్ ఇలా విరామం ప్రకటించడంతో ఆయన ఆరోగ్యంపై ఆసక్తి నెలకొంది. అయితే తనకు ప్రస్తుతం ఎదురైన ఆరోగ్య సమస్య ఏమిటో ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. కొంతకాలంగా అమితాబ్ ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో పలు చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఆయన చేసిన కొన్ని పోస్టులు కూడా అభిమానుల్లో సందేహాలు రేకెత్తించాయి. దీనికి తోడు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమం తాజా సీజన్ సందర్భంగా తన మోకాలికి గాయమైనట్లు ఆయన గతంలో వెల్లడించారు. ఇప్పుడు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో, ఆ గాయానికి సంబంధించిన సమస్యే ప్రస్తుత విరామానికి కారణమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే మోకాలి గాయం వల్లే ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు అమితాబ్ ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు.అయితే అమితాబ్ తాజా ప్రకటనతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూనే, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. తన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న అమితాబ్ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అప్డేట్ను అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? వైద్యులు ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు? తిరిగి ఎప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై అమితాబ్ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి మరింత సమాచారం వెలువడితేనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

