Alia Bhatt | యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న 7వ సినిమా ‘ఆల్ఫా’ టీజర్ బుధవారం విడుదలైంది. శివ్ రావల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో అలియా భట్ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించింది. ఈ టీజర్లో అలియా భట్ ఒక ట్రైన్డ్ కిల్లర్‌గా శత్రువులపై విరుచుకుపడుతూ కనిపించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఆమెకు తండ్రిగా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్ కేవలం ఒక సాధారణ అమ్మాయిలా కాకుండా, చిన్నప్పటి నుంచే పోరాటాల మధ్య పెరిగిన ఒక ప్రమాదకరమైన హంతకురాలిగా కనిపించబోతుంది. భారీ యాక్షన్ సీన్లు, గన్ఫైట్లు, ఫైటింగ్‌లతో ఆమె అదరగొట్టింది. ఈ టీజర్ సినిమాలోని యాక్షన్‌ను చూపించడమే కాకుండా, అలియా భట్, బాబీ డియోల్ పాత్రల మధ్య ఉండే బలమైన బంధాన్ని కూడా చూపిస్తోంది.
మరోవైపు ఈ సినిమాలో మరో హీరోయిన్ శర్వరి కూడా నటిస్తోంది. రాబోయే రోజుల్లో ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం ప్రకటించనుంది. బాలీవుడ్లో ఇద్దరు హీరోయిన్లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న అరుదైన భారీ యాక్షన్ సినిమా ఇది. యాక్షన్, సెంటిమెంట్, సస్పెన్స్, కామెడీ కలబోతగా వస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ మూవీ 2026, జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.