ట్రాక్‌లో అడుగుపెడితే అన్నీ మర్చిపోతా!

‘సినిమాల్ని అంగీకరించే ముందు నేను ఎలాంటి అంచనాల్ని పెట్టుకోను. నా శైలిలో పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తా’ అని చెప్పింది నివేదా పేతురాజ్. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘పాగల్’. విశ్వక్సేన్ కథానాయకుడు. దిల్‌రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. నరేష్ కుప్పిలి దర్శకుడు. ఈ నెల 14న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో నివేదా పేతురాజ్ పాత్రికేయులతో ముచ్చటించింది.
రెండేళ్ల ముందు ఈ కథ విన్నా. దర్శకుడు నరేష్ కథ చెబుతున్నప్పుడే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యా. కొన్ని సీన్స్ వింటుంటే కన్నీళ్లు ఆగలేదు. తెరపై ఆ సన్నివేశాలను చూసినప్పుడు అదే అనుభూతి కలిగింది. తనకు ఈ కథ బాగా నచ్చిందని దిల్‌రాజుగారు నాతో అన్నారు. ఆయన మాటలతో సినిమాపై నాకున్న నమ్మకం ఇంకా బలపడింది. రెగ్యులర్ లవ్‌స్టోరీస్‌కు భిన్నంగా ఉండే చిత్రమిది. ఇందులో తీర అనే అమ్మాయిగా నా పాత్ర సరికొత్తగా ఉంటుంది. నటనకు ప్రాధాన్యముంటుంది. మంచి సినిమా చేశాననే సంతృప్తి మిగిలింది.
ఒత్తిడి నుంచి దూరమవుతా..
కారు రేసింగ్ క్రీడలో నాకు చక్కటి ప్రావీణ్యం ఉంది. వృత్తిపరమైన ఒత్తిడుల నుంచి సాంత్వన పొందడానికి రేసింగ్ నాకు ఉపయోగపడుతుంది. సినిమాలతో పోలిస్తే ఫార్ములా రేసింగ్ భిన్నమైన రంగం. రేసింగ్ ట్రాక్‌లో అడుగుపెడితే పూర్తిగా సినిమాల్ని మర్చిపోతా. రేసును ఎలా ముగించాలి? కారును ఎలా నడపాలన్నదే ఆలోచిస్తా. కరోనా భయాల వల్ల సినిమా అవకాశాలు రావడం లేదని మధనపడుతూ ఎంతోమంది నటీనటులు డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. సినిమాలతో పాటు ప్రత్యామ్నాయంగా మరో రంగంపై దృష్టిపెట్టాలని నేను నమ్ముతా. ఆ ఆలోచనతోనే నేను ఫార్ములా రేసింగ్‌ను ఎంచుకున్నా. తెలుగులో కొత్త సినిమా డిసెంబర్లో ప్రారంభంకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

