Poacher | ఏనుగు దంతాల స్మగ్లింగ్ అంటూ వస్తున్న అలియా భట్.. ఆసక్తికరంగా ‘పోచర్’ ట్రైలర్
Alia Bhatt | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘పోచర్’ (Poacher). ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి అలియా భట్ నిర్మిస్తుంది. నిమిషా సజయన్, రోషన్ మథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు ఎమ్మీ అవార్డు విన్నర్ రిచీ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు.
Poacher | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘పోచర్’ (Poacher). ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి అలియా భట్ నిర్మిస్తుంది. నిమిషా సజయన్, రోషన్ మథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు ఎమ్మీ అవార్డు విన్నర్ రిచీ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సిరీస్ నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. ఏనుగు దంతాల స్మగ్లింగ్‌తో పాటు, అడవుల్లో వన్య ప్రాణులపై దాడుల చేసే వారిపై ఈ సిరీస్ రానుండగా.. వారిని పట్టుకునేందుకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, NGO కార్మికులు, లోకల్ పోలీసులు ఎం చేశారు అనేది ఈ సిరీస్ కథ అని తెలుస్తుంది. 8 ఎపిసోడ్లుగా రానున్న ఈ సిరీస్ . ఫిబ్రవరి 23వ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ సంస్థ క్యూసీ ఎంటర్టైన్మెంట్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

