Alia Bhatt | కేన్స్ 2026 రెడ్ కార్పెట్‌పై అలియా భట్ మ్యాజిక్.. ఇండియన్ టచ్‌తో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ
Alia Bhatt | ప్రపంచ సినీ, ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించే ప్రతిష్ఠాత్మక వేడుక కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి మనసులు దోచుకున్నారు. ఫ్రెంచ్ రివియేరాలో ఉదయం కలల ప్రపంచాన్ని తలపించేలా కనిపించిన అలియా, సాయంత్రం రెడ్ కార్పెట్‌పై మరింత గ్లామరస్‌గా మెరిసి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు.
Alia Bhatt | ప్రపంచ సినీ, ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించే ప్రతిష్ఠాత్మక వేడుక కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి మనసులు దోచుకున్నారు. ఫ్రెంచ్ రివియేరాలో ఉదయం కలల ప్రపంచాన్ని తలపించేలా కనిపించిన అలియా, సాయంత్రం రెడ్ కార్పెట్‌పై మరింత గ్లామరస్‌గా మెరిసి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. లొరియల్ పారిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా కేన్స్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టిన అలియా, ప్రముఖ డిజైనర్ తమరా రాల్ఫ్ రూపొందించిన ప్రత్యేక గౌన్‌లో కనిపించారు. బ్లష్ పింక్ షేడ్‌లో రూపొందిన ఈ స్ట్రాప్‌లెస్ గౌన్ ఆమెకు అద్భుతమైన ఎలిగెన్స్‌ను తీసుకొచ్చింది.
ఈ గౌన్‌లో కర్వ్డ్ బస్టియర్ నెక్లైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే కార్సెట్ స్టైల్ బాడిస్ ఆమె ఫిట్నెస్ను మరింత హైలైట్ చేసింది. ఇక గౌన్‌కు జతగా చేతుల చుట్టూ వేసుకున్న దుపట్టా తరహా డ్రేప్ మొత్తం లుక్కు ఇండియన్ టచ్‌ను తీసుకొచ్చింది. పాశ్చాత్య ఫ్యాషన్‌లో భారతీయ శైలిని మిళితం చేసిన ఈ డిజైన్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. అలియా మినిమల్ జువెలరీ, సాఫ్ట్ మేకప్, సింపుల్ హెయిర్ స్టైల్‌తో రెడ్ కార్పెట్‌పై రాయల్ లుక్‌లో కనిపించారు. ఆమె చిరునవ్వు, ఆత్మవిశ్వాసం ఈ లుక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి. కేన్స్‌లో అలియా చేసిన ఈ స్టైల్ స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫ్యాన్స్‌తో పాటు ఫ్యాషన్ విమర్శకులు కూడా అలియా లుక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ సాంప్రదాయాన్ని ఆధునిక ఫ్యాషన్‌తో మేళవిస్తూ అలియా మరోసారి గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్‌గా తన స్థాయిని చాటుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కేన్స్ వేదికపై భారతీయ నటీమణులు తమ ప్రత్యేక ఫ్యాషన్ స్టైల్స్‌తో ఆకట్టుకుంటుండగా, ఈసారి అలియా భట్ తన సొగసైన రెడ్ కార్పెట్ లుక్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అలియా లుక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
Alia Bhatt at The Cannes Film Festival’s 📸 pic.twitter.com/ihhuKS2oJA
— Alia’s nation (@Aliasnation) May 12, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

