Oh My God-2 Movie Direct Ott Release | బాలీవుడ్ అగ్ర హీరోలలో అక్షయ్ కుమార్ ఒకడు. ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కాని విధంగా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు విడుదల చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. అయితే ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్ నుంచి ఆశించిన స్థాయి సినిమాలు రావడం లేదు. కొవిడ్‌కు ముందు వరుస హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉన్న అక్షయ్.. కొవిడ్ తర్వాత పూర్తిగా డల్ అయిపోయాడు. కరోనా తర్వాత ఈయన నటించిన 9 సినిమాలు రిలీజయ్యాయి. అందులో రెండు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. కాగా మిగిలిన ఏడింటిలో ఒక్కటి మాత్రమే కమర్షియల్‌గా హిట్ సాధించింది. మిగితావన్ని డిజాస్టర్లుగా మిగిలాయి. దాంతో ఈయన గ్రాఫ్ అమాంతం పడిపోయింది.
ఇటీవలే ఎన్నో అంచనాల నడుమ రిలీజైన సెల్ఫీ కూడా అక్షయ్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. దాంతో తన తదుపరి సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్షయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఓ మై గాడ్-2. పదేళ్ల క్రితం బాలీవుడ్ బాక్సాఫీస్‌పై సంచలనం సృష్టించిన ఓ మై గాడ్ సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ముందు నుంచి ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన అక్షయ్‌కుమార్ గత సినిమాల ఫలితాల కారణం వల్ల ఓటీటీ మార్గాన్నే ఎంచుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి కీలకపాత్ర పోషిస్తున్నాడు. మొదటి పార్ట్‌లో కృష్ణగా లీలలు చేసిన అక్షయ్.. సెకండ్ పార్టులో శివుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. జియో లేదా వూట్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.