Ajith | అజిత్‌కు గుడి కడతామంటూ అభిమానుల ప్రకటన.. విగ్రహానికి క్షీరాభిషేకం
Ajith | తమిళనాడు రాజకీయాలు, సినీ అభిమానుల హంగామా ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ముఖ్యమంత్రి కావడంతో అక్కడి సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు, తమ అభిమాన నటులపై ప్రేమను కొందరు అభిమానులు వినూత్నంగా చాటుకుంటున్నారు.
Ajith | తమిళనాడు రాజకీయాలు, సినీ అభిమానుల హంగామా ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ముఖ్యమంత్రి కావడంతో అక్కడి సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు, తమ అభిమాన నటులపై ప్రేమను కొందరు అభిమానులు వినూత్నంగా చాటుకుంటున్నారు. గతంలో నటి ఖుష్బూ కోసం గుడి నిర్మించడం, నయనతారకు భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం వంటి ఘటనలు వార్తల్లో నిలిచాయి. తాజాగా ఈ జాబితాలోకి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానులు కూడా చేరారు. ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి, క్షీరాభిషేకం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులోని చెన్నై సమీపంలోని మాంగాడు ప్రాంతం కోవూరులో అజిత్ అభిమానులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తుంది. ‘అనైత్తు నన్బర్గళ్ మున్నేట్ర కళగం’ అనే సంస్థ అధ్యక్షుడు బాబు నేతృత్వంలో అజిత్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా దిష్టి తీసి 108 కొబ్బరికాయలు కొట్టడంతో పాటు ‘జై అజిత్’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన నటుడిపై ఉన్న ప్రేమను ఈ విధంగా వ్యక్తం చేయడం చర్చకు దారితీసింది.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు బాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు రాజకీయంగా పోటీ ఇవ్వగల సమర్థవంతమైన నాయకుడు అజిత్ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, భవిష్యత్తులో అజిత్‌కు ఆలయం నిర్మించాలనే ఆలోచన కూడా ఉందని వెల్లడించినట్లు తెలుస్తోంది.
అయితే అజిత్ రాజకీయాల్లోకి వస్తారనే విషయంపై పూర్తి క్లారిటీ లేదు. ఆయన రాజకీయ ప్రవేశంపై స్వయంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించారనే దానికి సంబంధించిన స్పష్టత లేదు. అభిమానుల ఆకాంక్షలు, వారి రాజకీయ అభిప్రాయాలు వేరు.. అజిత్ వ్యక్తిగత నిర్ణయం వేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమిళనాడులో సినిమా, రాజకీయాలకు మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. గతంలో పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశించి కీలక పాత్ర పోషించారు. తాజాగా నటుడు విజయ్ రాజకీయాల్లో విజయం సాధించడంతో సినీ అభిమానుల్లో రాజకీయాలపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇతర హీరోల అభిమానులు కూడా తమ అభిమాన తారలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajith | అజిత్‌కు గుడి కడతామంటూ అభిమానుల ప్రకటన.. విగ్రహానికి క్షీరాభిషేకం
Health tips | నోటి పుండ్లు మిమ్మల్ని వేధిస్తున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
Job Fraud | ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మహిళ నుంచి రూ.4.50 లక్షలు వసూలు.. ఆపై రిసార్ట్‌కు తీసుకెళ్లి అత్యాచారం
Car Race: బ్రిటన్‌లో కారు రేస్.. ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు 28 ఏళ్ల జైలుశిక్ష
Nani | ‘బ్లడీ రోమియో’లో బాలీవుడ్ నటుడు.. కీలక పాత్రలో కనిపించనున్న ‘ధురంధర్’ ఫేమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

